ఆ సౌత్ హీరో నా డార్లింగ్: మను భాకర్
పారిస్ ఒలింపిక్స్ 2024లో రెండు కాంస్య పతకాలు సాధించిన భారత షూటర్ మను భాకర్.. తన ఫేవరేట్ సౌతిండియా హీరో ఎవరో చెప్పింది. తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్ తనకు ఇష్టమైన హీరోనని, డార్లింగ్ అని చెప్పుకొచ్చింది. ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన తొలి భారత అథ్లెట్‌గా చరిత్ర సృష్టించిన మనుభాకర్.. చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైంది.
ఈ ఒలింపిక్ మెడలిస్ట్‌కు తమిళనాడు ముఖ్యమంత్రి ఎమ్‌కే స్టాలిన్ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమెతో సరదాగా మాట్లాడిన స్టాలిన్.. తాను ఎవరో గుర్తు పట్టాలని ప్రశ్నించారు. అయితే మను భాకర్ సీఎం స్టాలిన్‌ను గుర్తించడంలో ఇబ్బంది పడింది. ఆ వెంటనే విజయ్ గురించి ప్రశ్నించగా.. అతను తన ఫేవరేట్ అని చెప్పుకొచ్చింది. దిగ్గజ హీరో అని, తన డార్లింగ్ అంటూ బదులిచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

ఈ కార్యక్రమంలో మను భాకర్‌ను తమిళనాడు ప్రభుత్వం ఘనంగా సత్కరించడంతో పాటు ఆమెకు ప్రకటించిన క్యాష్ ప్రైజ్‌ను అందజేసింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టోల్, మిక్స్‌డ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టోల్ ఈవెంట్స్‌లో మను భాకర్ కాంస్య పతకాలు సాధించిన విషయం తెలిసిందే.
విజయ్ తదుపరి సినిమా గోట్(GOAT) సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రాన్ని వెంకట్ ప్రభు తెరకెక్కించారు.
Olympic Shooter #ManuBhaker Teveals Her Fan Moment For #Thalapathy @actorvijay ❤️pic.twitter.com/GH7R5wG2gx
— Thalapathy Vijay Rasigai (@SubaLak79141886) August 20, 2024
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications