Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Paris Oympics 2024: కునుకు తీసి గోల్డ్ కొట్టింది! (వీడియో)

పారిస్ ఒలింపిక్స్‌ 2024లో ఉక్రెయిన్ మహిళా హైజంపర్ యారోస్లోవా ముహుచిఖ్ బంగారు పతకం సాధించింది. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్థరాత్రి ధాటక జరిగిన మహిళల హై జంప్ ఫైనల్స్‌లో అగ్రస్థానంలో నిలిచి పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది. అయితే ఫైనల్లో బరిలోకి దిగే ముందు తన బ్యాగ్‌పై యారోస్లోవా ఓ కునుకు తీసింది.

తన టైమ్ వచ్చే సరికి నిద్రపోయింది. ఫైనల్స్‌లో తన పేరు ప్రకటించగానే నిద్రలో నుంచి లేచి నేరుగా హైజంప్ చేసింది. ఆమె చేసిన 2.10 మీటర్ల హైజంప్‌ను ఎవరూ బీట్ చేయకపోవడంతో అగ్రస్థానంలో నిలిచి బంగారు పతకాన్ని సాధించింది. కునుకు తీసి గోల్డ్ కొట్టిన ఆమెపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తున్నాయి.

Paris Oympics 2024 Ukrainian High Jumper Yaroslava Mahuchikh Rested in a Sleeping Bag Then She Won Gold

ఇందుకు సంబంధించిన ఫొటోలు వీడియో నెట్టింట వైరల్‌గా మారాయి. ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా.. రిలాక్స్ అయ్యేందుకే కునుకు తీసానని మెడల్ గెలిచాక యారోస్లోవా మహుచిఖ్ చెప్పుకొచ్చింది. కెరీర్‌లో ఆమెకు ఇదే తొలి బంగారు పతకం కావడం విశేషం.

టోక్యో ఒలింపిక్స్‌లో 2 మీటర్ల ఎత్తును క్లియన్ చేసిన యారస్లావా రజత పతకం గెలిచింది. అప్పుడు ఆస్ట్రేలియాకు చెందిన ఎలినల్ పాటర్‌స్ 2.02 మీటర్ల ఎత్తుతో పసిడి సాధించింది. కానీ ఈసారి ఆమె 2 మీటర్ల ఎత్తును క్లియర్ చేయలేక మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని అందుకుంది. ఆస్ట్రేలియాకే చెందిన నికోలా ఒలిస్లేగర్స్ రజతం సాధించింది.

Story first published: Monday, August 5, 2024, 15:16 [IST]
Other articles published on Aug 5, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+