For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Paris Oympics 2024: కాంస్యం గెలిచిన సర్పంచ్ కొడుకు!

పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత షూటర్ల హవా కొనసాగుతోంది. ఇప్పటికే మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో మను భాకర్.. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో మను భాకర్-సరబ్‌జోత్ జోడీ కాంస్య పతకాలు అందించగా.. తాజాగా ఈ జాబితాలో మరో షూటర్ స్వప్నిల్ కుసాలే చేరాడు.పురుషుల 50మీటర్ల రైఫిల్‌ 3 పొజిషన్స్‌ విభాగంలో స్వప్నిల్‌ కుసాలే కాంస్యం సాధించాడు. గురువారం జరిగిన ఫైనల్లో స్వప్నిల్ కుసాలే 451.4 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు.

అయితే మోకాళ్లపై కూర్చుని 153.3 పాయింట్లు సాధించిన సమయానికి స్వప్నిల్ ఆరో స్థానంలో ఉన్నాడు. బోర్లా పడుకునే తూటా పేల్చే టైమ్‌కు 310.1 పాయింట్లతో అయిదో స్థానానికి ఎగబాకాడు. అయితే నిలబడి షూట్ చేసే సమయానికి స్వల్ప పాయింట్ల తేడాతో స్వప్నిల్ క్రమంగా ముందుకు సాగాడు. అంతిమంగా పతకం సాధించాడు.

Paris Oympics 2024 Son of Sarpanch MS Dhoni fan Meet Swapnil Kusale ticket collector who won bronze

ధోనీ అభిమాని..
మహారాష్ట్రకు చెందిన స్పప్నిల్‌కు ఇదే తొలి ఒలింపిక్ మెడల్. దాంతో అతని పేరు సోషల్ మీడియా వేదికగా మారుమోగుతోంది. స్వప్నిల్ కుసాలే గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు తెగ ఆసక్తిచూపిస్తున్నారు. టీమిండియా దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని స్ఫూర్తిగా తీసుకొనే తాను అథ్లెట్‌గా మారనని ఓ ఇంటర్వ్యూలో స్వప్నిల్ చెప్పుకొచ్చాడు.

ధోనీలా తాను కూడా రైల్వే టికెట్ కలెక్టర్‌నని తెలిపాడు. మహారాష్ట్రలోని కోల్హాపూర్ సమీపంలోని కంబాల్వాడి గ్రామానికి చెందిన 29 ఏళ్ల స్వప్నిల్ కుసాలే.. 2012 నుంచి అంతర్జాతీయ టోర్నీల్లో పాల్గొంటున్నాడు. 12 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత అతను ఒలింపిక్ మెడల్ సాధించాడు. ధోనీలానే ప్రశాంతంగా, ఓపికగా ఉండటానికి కుసాలే ఇష్టపడుతాడు.

ధోనీలోని ఆ గుణాలు ఇష్టం..
ధోనీ క్రికెట్ కెరీర్ ఇతి వృత్తంగా రూపొందించిన ఎంఎస్ ధోనీ సినిమాను తాను ఎన్నోసార్లు చూశానని కూడా స్వప్నిల్ కుసాలే చెప్పుకొచ్చాడు. 'షూటింగ్‌లో ఏ వ్యక్తిని నేను ప్రత్యేకంగా ఫాలో అవ్వను. కానీ క్రికెటర్ ధోనీ అంటే నాకు ఇష్టం. మైదానంలో ఆయన ప్రశాంతంగా, ఓపికగా ఎలా ఉంటాడో.. అది షూటింగ్‌కు అవసరం. నేను కూడా ఆయనలానే రైల్వేలో టికెట్ కలెక్టర్‌. మా ఇద్దరీ స్టోరీలు ఒకేలా ఉంటాయి.

సర్పంచ్ కొడుకు
స్వప్నిల్ కుసాలే తన కుటుంబం నుంచే మొదటి ప్రేరణ పొందాడు. అతని తండ్రి, సోదరుడు జిలాస్థాయి పాఠశాల అధ్యాపకులు కాగా.. అతని తల్లి తమ గ్రామమైన కంబాల్వాడి సర్పంచ్. 2015 ఏషియన్ షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో స్వప్నిల్ 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ ఈవెంట్‌లో స్వర్ణం సాధించాడు. 59వ నేషనల్ షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లోనూ అతను పతకాలు గెలిచాడు. 2022 ఏషియన్ గేమ్స్‌లో బంగారు పతకం సాధించిన స్వప్నిల్.. అరంగేట్ర ఒలింపిక్స్‌లోనే సత్తా చాటి మెడల్ సాధించాడు.

Story first published: Thursday, August 1, 2024, 16:08 [IST]
Other articles published on Aug 1, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+