Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Paris Oympics 2024: మహిళా స్విమ్మర్లపై అనుచిత వ్యాఖ్యలు.. కామెంటేటర్‌పై వేటు!

పారిస్ ఒలింపిక్స్ 2024లో నోరుజారిన ఓ కామెంటేటర్‌పై నిర్వాహకులు వేటు వేసారు. మహిళా స్విమ్మర్ల విజయాన్ని ఉద్దేశించి వెకిలి కామెంట్లు చేసిన సదరు కామెంటేటర్‌ను ఒలింపిక్స్ అధికారిక బ్రాడ్‌కాస్టర్ యూరో స్పోర్ట్స్ విధుల నుంచి తొలగించి ఇంటికి పంపించింది. ఈ ఘటన ఆదివారం చోటు చేసుకుంది. 4X400 ఫ్రీస్టైల్ రిలేలో ఆస్ట్రేలియా మహిళా స్విమ్మర్లు స్వర్ణం సాధించారు.

ఈ సందర్భంగా ప్రముఖ కామెంటేటర్ బాబ్ బల్లర్డ్ వారి విజయాన్ని ప్రకటిస్తూ సెక్సిస్ట్ కామెంట్స్ చేశాడు. సహచర కామెంటేర్ లిజ్జీ సైమండ్స్ సైతం ఆయన వ్యాఖ్యలు అభ్యంతరంగా ఉన్నాయని తెలిపారు. కానీ అతను వెకిలి నవ్వు నవ్వి ఊరుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కాగా.. సదరు కామెంటేటర్‌పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో రంగంలోకి దిగిన యూరో స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్.. బల్లర్డ్ తప్పును గుర్తించి వేటు వేసింది.

Paris Oympics 2024 Commentator Removed For Sexist Remark On Australian Women s Team

ఈ ఒలింపిక్స్‌లో పురుషులు, మహిళల క్రీడాకారుల సంఖ్య సమానంగా ఉంది. లింగ సమానత్వం దిశగా సాధించిన చారిత్రతాత్మక విజయంగా నిర్వాహకులు దీన్ని అభివర్ణిస్తున్నారు. ఈ తరుణంలో బాబ్‌.. మహిళలపై వెకిలి వ్యాఖ్యలు చేయడంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

స్విమ్మింగ్‌లో 4X400 ఫ్రీస్టైల్ రిలేలో ఆస్ట్రేలియా మహిళా స్విమ్మర్లు 3.28.92 నిమిషాల్లో పూర్తి చేసి బంగారు పతకాన్ని సాధించారు. అమెరికా, చైనా స్విమ్మర్లు తర్వాతి స్థానాల్లో నిలిచి సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ అందుకున్నాయి. ఈ ఈవెంట్‌లో ఆస్ట్రేలియా గోల్డ్ గెలవడం వరుసగా నాలుగోసారి కావడం విశేషం.

Story first published: Monday, July 29, 2024, 22:09 [IST]
Other articles published on Jul 29, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+