Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Paris Olympics 2024: ఐదు మిల్లీ సెకన్ల తేడాతో చేజారిన గోల్డ్ మెడల్..! (వీడియో)

పారిస్ ఒలింపిక్స్ 2024లో అరుదైన ఘటన చోటు చేసుకుంది. జస్ట్ 5 మిల్లీ సెకన్ల తేడాతో జమైకా స్ప్రింటర్ కిషనే థాంప్సన్ బంగారు పతకాన్ని చేజార్చుకున్నాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్థరాత్రి 1.20 గంటలకు జరిగిన 100 మీటర్ల పరుగు పందెంలో అమెరికా అథ్లెట్ నోవా లైల్స్ విజేతగా నిలిచాడు.

ఆసాంతం ఉత్కంఠగా సాగిన ఈ రేసు ప్రేక్షకులను కట్టిపడేసింది. మైదానం అంతా చెవులు చిల్లులు పడేంత గోల మధ్య రేసు మొదలవ్వగా.. అసలు వాళ్లు వనుషులా, యంత్రాలా అన్నట్లు అథ్లెట్స్ పరుగుతీసారు. 50 మీటర్ల వరకు జమైకన్ థాంప్సన్ చాలా స్పష్టమైన ఆధింక్యంలో కనిపించాడు. మరోవైపు అమెరికా స్ప్రింటన్ నోవా లైల్స్ మెల్లగా వేగం పెంచుకొని ఒక్కొక్కరినీ దాటుకుంటూ చివరి 10 మీటర్లలో రెండో స్థానానికి వచ్చాడు. చిరుత పులుల్లా అథ్లెట్లంతా స్టాప్ లైన్ దాటారు.

Paris Olympics Noah Lyles Beat Kishane Thompson To Men s 100m Gold with 5 Milliseconds Difference

ఈ రేసులో థాంప్సనే విజేత అని అందరూ భావించారు. కామెంటేటర్స్ సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. రేసు పూర్తయి పది సెకన్లు అయినా.. బిగ్ స్క్రీన్‌పైన ఫైనల్ స్టాండింగ్స్‌ను ప్రదర్శించలేదు. ఫలితం కోసం నీరిక్షించే ఓపిక లేక థాంప్సన్ గట్టిగా అరుస్తూ తన అసహనాన్ని బయటపెట్టాడు. లైల్స్ మాత్రం థాంప్సన్ వెనుకాలే నిల్చొని స్క్రీన్ వైపు చూస్తూ ఉండిపోయాడు.

నిజానికి అతను కూడా థాంప్సనే విజేత అనుకున్నాడు. అతన్ని అభినందించేందుకు సిద్దమైనట్లు కూడా కనిపించాడు. కానీ ఆశ్చర్యంగా లైల్స్ విజేత అంటూ బిగ్ స్క్రీన్‌పై ప్రకటించారు. థాంప్సన్ కంటే అతను సెకనులో 5/1000 వంత సమయం ముందుగా ధాటాడని పేర్కొన్నారు. దాంతో 5 మిల్లి సెకన్ల వ్యత్యాసంతో లైల్స్ బంగారు పతకాన్ని ఎగరేసుకుపోయాడు.

ఫొటో ఫినిష్‌లో ఈ విషయం స్పష్టమైంది. లైల్స్ 9.79(.784) సెకన్లలో 100 మీటర్ల రేసు పూర్తి చేయగా.. కిషనే కూడా 9.79(.789) సెకన్లలో లక్ష్యాన్ని పూర్తి చేశాడు. దాంతో జమైకా అథ్లెట్‌పై నెటిజన్లు సానుభూతి చూపిస్తున్నారు. రేస్ అసాంతం ముందంజలో ఉండి లక్ష్యాన్ని చేరుకునే సమయంలో 5 మిల్లీ సెకన్లతో పసిడిని చేజార్చుకున్నాడని కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ 100 మీటర్ల రేసు మానవాళికి ఓ స్ఫూర్తి అంటూ కామెంట్ చేస్తున్నారు.

అమెరికాకు చెందిన ఫ్రెడ్ కెర్లీ 9.81 సెకన్ల టైమింగ్‌తో కాంస్యం సొంతం చేసుకున్నాడు. టోక్యో ఒలింపిక్స్ కెర్లీ సిల్వర్ సాధించాడు. అప్పుడు బంగారు పతకం సాధించిన ఇటలీ స్ప్రింట్ మార్సెల్ జాకబ్స్ 9.85 సెకన్లతో ఐదో స్థానానికి పరిమితమయ్యాడు.

Story first published: Monday, August 5, 2024, 14:29 [IST]
Other articles published on Aug 5, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+