Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Paris Olympics 2024: నీరజ్ చోప్రా ఈవెంట్ ఎప్పుడంటే..?

పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్ పతకాల ఖాతా తెరిచింది. మహిళా షూటర్ మను భాకర్ అసాధారణ ప్రదర్శనతో రెండు కాంస్య పతకాలు సాధించింది. 124 ఏళ్ల ఒలింపిక్స్ చరిత్రలోనే ఒకే ఎడిషన్‌లో రెండు పతకాలు గెలిచిన భారత అథ్లెట్‌గా మను భాకర్ చరిత్ర సృష్టించింది.

మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో కాంస్య పతకం సాధించి భారత మెడల్స్ ఖాతా తెరిచిన మను భాకర్.. 48 గంటల వ్యవధిలోనే మరో పతకాన్ని ముద్దాడింది.

Paris Olympics 2024 When will Neeraj Chopra play

10 మీటర్ల పిస్టల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ విభాగంలో సరబ్‌జోత్ సింగ్‌తో కలిసి మరో కాంస్యాన్ని అందుకుంది. మంగళవారం జరిగిన కాంస్య పతక పోరులో మను భాకర్-సరబ్ జోత్ సింగ్ ద్వయం 16-10తో సౌత్ కొరియాకు చెందిన జుయీ లీ-వోన్షోలీపై విజయం సాధించింది. ఇతర ఈవెంట్స్‌ల్లో భారత్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. బ్యాడ్మింటన్, బాక్సింగ్, టేబుల్ టెన్నిస్‌లో భారత అథ్లెట్లు శుభారంభం చేసి పతకం సాధిస్తున్నారు.

అయితే టోక్యో ఒలింపిక్స్‌లో బంగారు పతకంతో మెరిసిన భారత బళ్లెం వీరుడు, గోల్డెన్ భాయ్ నీరజ్ చోప్రా గురించి నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు. పారిస్ ఒలింపిక్స్ ప్రారంభమై ఐదు రోజులు అవుతున్నా.. గోల్డెన్ భాయ్ ముచ్చట వినబడటం లేదు? ఏందని గాబరాపడుతున్నారు. పారిస్ ఒలింపిక్స్ ఆరంభ వేడుకల్లో కూడా నీరజ్ చోప్రా కనిపించడంతో అతని ఈవెంట్స్ ఎప్పుడా? అని ఆరా తీస్తున్నారు.

అయితే పారిస్ ఒలింపిక్స్ అథ్లెటిక్స్ ఈవెంట్స్ ఇంకా ప్రారంభం కాలేదు. ఆగస్ట్ 1 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇక జావెలిన్ త్రో క్వాలిఫికేషన్ రౌండర్ ఆగస్ట్ 6న జరగనున్నాయి. దాంతోనే నీరజ్ చోప్రా పారిస్‌‌కు ఆలస్యంగా వచ్చాడు. మంగళవారమే గోల్డెన్ భాయ్ ఒలింపిక్స్ విలేజ్‌లో అడుగుపెట్టాడు. దాంతో అతను ఒలింపిక్స్ ఆరంభ వేడుకల్లో పాల్గొనలేదు.

టోక్యోలో బంగారు పతకం గెలిచిన నీరజ్ చోప్రా.. అథ్లెటిక్స్‌లో పసిడి సాధించిన తొలి భారత అథ్లెట్‌గా చరిత్రకెక్కాడు. దాంతో అతనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరో గోల్డ్ సాధిస్తాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

నీరజ్ చోప్రా క్వాలిఫికేషన్ రౌండ్ ఆగస్ట్ 6న మధ్యాహ్నం 1.50 గంటలకు ప్రారంభం కానుంది. నీరజ్ చోప్రా ఫైనల్‌కు అర్హత సాధిస్తే.. ఆగస్ట్ 8న మధ్యాహ్నం 11.55 గంటలకు ఫైనల్ ప్రారంభం కానుంది.

జావెలిన్ త్రో షెడ్యూల్..

క్వాలిఫికేషన్ రౌండ్స్:
ఆగస్ట్ 6, గ్రూప్-ఏ మధ్యాహ్నం 1.50 గంటలకు

ఆగస్ట్ 6, గ్రూప్-బీ, మధ్యాహ్నం 3.20 గంటలకు

ఫైనల్ :
ఆగస్ట్ 8 మధ్యాహ్నం 11.55 నిమిషాలకు ప్రారంభం..

Story first published: Tuesday, July 30, 2024, 17:33 [IST]
Other articles published on Jul 30, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+