Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Paris Olympics 2024: ఫ్లాగ్ బేరర్‌గా పీవీ సింధు!

పారిస్ ఒలింపిక్స్ 2024 ప్రారంభ వేడుకల్లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఫ్లాగ్ బేరర్‌గా వ్యవహరించనుంది. టేబుల్ టెన్నిస్ ప్లేయర్ శరత్ కమల్‌తో పాటు పీవీ సింధు మువ్వెన్నల జెండాను పట్టుకొని భారత అథ్లెట్ల బృందానికి సారథ్యం వహించనుంది. ఈ విషయాన్ని ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్(ఐఓఏ) ప్రెసిడెంట్ పీటీ ఉష ఓ ప్రకటనలో తెలిపింది.

పీవీ సింధు ఇప్పటికే రెండు ఒలింపిక్స్ మెడల్స్‌ను అందించిన విషయం తెలిసిందే. రియో ఒలింపిక్స్‌లో రజతం గెలిచిన పీవీ సింధు, టోక్యో ఒలింపిక్స్‌లో బ్రాంజ్ మెడల్ సాధించింది. పారిస్ ఒలిపింక్స్‌లో స్వర్ణ పతకమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. జూలై 26న పారిస్ ఒలింపిక్స్‌కు తెరలేవనుంది.

Paris Olympics 2024 PV Sindhu Sharath Kamal confirmed as India s flag bearer

ఈ మెగా ఈవెంట్‌లో పాల్గొనే భారత బృందానికి చెఫ్ దే మిషన్‌గా షూటర్ గగన్ నారంగ్ నియమితులయ్యారు. దిగ్గజ బాక్సర్ మేరీకోమ్ స్థానంలో ఐఓఏ నారంగ్‌ను నియమించింది. షూటింగ్ విభాగంలో భారత్‌కు నారంగ్ నాలుగు ఒలింపిక్స్ మెండల్స్ అందించారు. ఏప్రిల్‌లో మేరీ కోమ్ చెఫ్ దె మిషన్ బాధ్యతల నుంచి తప్పుకుంది. వ్యక్తిగత కారణాలతో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐఓఏ ప్రెసిడెంట్‌కు లేఖ రాసింది. తాజాగా ఆమె స్థానంలో గగన్ నారంగ్‌కు ఐఓఏ అవకాశం ఇచ్చింది.

Story first published: Monday, July 8, 2024, 22:42 [IST]
Other articles published on Jul 8, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+