For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Paris Olympics 2024: ఆమె అందానికి పిచ్చెక్కిపోయిన స్టార్ ఫుట్‌బాలర్..!

పరాగ్వే స్విమ్మర్ లువానా అలోన్సోను సంచలన ఆరోపణలు చేసింది. తన అందానికి ఫిదా అయిన ఓ ఫుట్‌బాల్ స్టార్ ప్రైవేట్ మెసేజ్ చేశాడని తెలిపింది. పారిస్ ఒలింపిక్స్ 2024లో స్విమ్మింగ్ 100 మీటర్ల బటర్‌ఫ్లై కేటగిరీలోపోటీపడిన లువానా.. క్వార్టర్ ఫైనల్స్ కూడా గెలిచి.. సెమీస్‌కు చేరుకుంది. కానీ దురదృష్టవశాత్తు సెమీస్‌లో వెనుదిరిగింది. తన పోటీలు అనంతరం అక్కడే ఉండి ఒలింపిక్ విలేజ్‌లో కలివిడిగా తిరుగుతూ తన సమయాన్ని ఆస్వాదించాలనుకుంది.

కానీ సహచర పరాగ్వే పరుషుల అథ్లెట్లు ఆమెపై ఫిర్యాదు చేశారు. లువానా అందంతో తాము చాలా డిస్ట్రబ్ అవుతున్నామని, ఏకాగ్రత దెబ్బతినేలా వ్యవహరిస్తుందని ఆరోపించారు.

Paris Olympics 2024 Paraguayan Swimmer Luana Alonso Says Neymar Sent Me A DM

ఆమె ఉంటే మేము ఆటల్లో సరిగా పాల్గొనలేమని పరాగ్వే మేనేజ్‌మెంట్‌కు చెప్పారు. పరాగ్వే జట్టు మేనే‌జ్‌మెంట్ కూడా పురుషుల అథ్లెట్ల మాటే విని తమ దేశ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. వెంటనే లువానాను తిరిగి వచ్చేయాలని వారు ఆదేశించారు. వాస్తవానికి ఓడిపోయిన ఆటగాళ్లు ఒలింపిక్స్ ముగిసే వరకు విలేజ్‌లో ఉండటానికి అర్హులే. కానీ స్వయంగా పరాగ్వే టీమ్ మగ ఆటగాళ్లే కంప్లైట్ చేయడంతో ఆమెను బయటకు పంపించక తప్పలేదు.

ఈ వ్యవహారంపై సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అయ్యింది. ఆమె అందమే శాపమైందనే శీర్షికలతో అనేక కథనాలు వచ్చాయి. 'Too Hot' అంటూ తన అందాన్ని వర్ణిస్తూ ఇంటర్నేషనల్ మీడియా కథనాలు రాసింది. తాజాగా ఓ ఫుట్‌బాలర్ తన అందానికి పిచ్చేక్కిపోయి ప్రైవేట్‌గా మెసేజ్ చేశాడని తెలిపింది.

ఈ వార్తల ప్రభావమో లేక.. తన స్విమ్ సూట్ ఫోటోలను చూశాడేమో కానీ.. బ్రెజిల్ ఫుట్‌బాల్ జట్టు మాజీకెప్టెన్ నేయ్‌మర్ జూనియర్.. లువానుకు నేరుగా మెసేజ్ చేశాడంట. ఈ విషయాన్ని ఆమె వెల్లడించింది. 'బ్రెజిల్ ఫుట్‌బాల్ జట్టు మాజీ కెప్టెన్ నెయ్‌మర్ జూనియర్ నాకు డైరెక్ట్‌గా మెసేజ్ చేశాడు. ఇప్పుడు ఇంత కంటే ఎక్కువ నేను చెప్పలేను. అదీనూ విజ్ఞప్తి మేరకు వదిలేశా. దీని గురించి ఏం మాట్లాడను.'అని లువానా చెప్పుకొచ్చింది.

అంతేకాకుండా ఒలింపిక్ విలేజ్ నుంచి తనను పంపించారని వచ్చిన వార్తలను ఖండించింది. తనను ఎవరూ పంపించేలేదని, ఇలాంటి అసత్య వార్తలను ప్రచారం చేయవద్దని కోరింది.

Story first published: Sunday, August 11, 2024, 15:05 [IST]
Other articles published on Aug 11, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+