Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నాదేం ఉందన్నా.. విజయం అంటే వినేష్ ఫోగట్‌ది: నీరజ్ చోప్రా

భారత మహిళా రెజ్లర్ వినేష్ ఫోగట్ చరిత్ర సృష్టించింది. ఒలింపిక్స్ చరిత్రలో సెమీఫైనల్ చేరిన తొలి మహిళా రెజ్లర్‌గా చరిత్రకెక్కింది. పారిస్ ఒలింపిక్స్ 2024లో అసాధారణ ప్రదర్శన కనబర్చిన వినేష్ ఫోగట్ వరుస విజయాలతో సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. మహిళల 50 కేజీల ఫ్రీస్టైల్ విభాగంలో పోటీపడుతున్న వినేష్ ఫోగట్.. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్, వరల్డ్ నెంబర్ వన్ యుయ్ సుసాకీ(జపాన్)ను 3-2తో ఓడించింది. చివరి 10 సెకన్లలోనే ఈ విజయానికి కావాల్సిన పాయింట్స్ నమోదు చేయడం విశేషం.

అనంతరం అదే జోరులో 7-5తో ఉక్రెయిన్ రెజ్లర్ ఒక్సానా లివాచ్‌ను ఓడించి సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. మరికాసేపట్లో క్యూబా రెజ్లర్ యుస్నీలీస్ గుజ్మాన్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే వినేష్ ఫోగట్‌కు రజత పతకం ఖాయమవుతోంది. ఓడితే బ్రాంజ్ మెడల్ కోసం పోటీ పడాల్సి ఉంటుంది.

Paris Olympics 2024 Neeraj Chopra hails Vinesh Phogat for beating World NO 1 Yui Susak

వినేష్ ఫోగట్ సాధించిన ఈ విజయంపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. భారత జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా సైతం వినేష్ ఫోగట్ విజయాన్ని ప్రత్యేకంగా ప్రశంసించాడు. ఆమె మెడల్ గెలవాలని కోరుకున్నాడు. మంగళవారం జరిగిన జావెలిన్ త్రో క్వాలిఫికేషన్‌లో నీరజ్ చోప్రా.. ఈటెను 89.34 మీటర్ల దూరం విసిరి ఫైనల్‌కు దూసుకెళ్లాడు. ఈ నెల 8న రాత్రి 11.55 గంటలకు జరిగే ఫైనల్ ఈవెంట్‌లో నీరజ్ చోప్రా మెడల్ కోసం పోటీ పడనున్నాడు.

ఫైనల్ చేరిన అనంతరం అధికారిక బ్రాడ్‌కాస్టర్‌తో మాట్లాడిన నీరజ్ చోప్రా వినేష్ ఫోగట్ గురించి ప్రత్యేకంగా మాట్లాడాడు. 'వినేష్ ఫోగట్ సాధించిన విజయం అసాధారణం. వరల్డ్ నంబర్ వన్‌ సుసాకీని వినేష్ ఫోగట్ ఓడించడం నమ్మశక్యం కానీ విషయం. ఇక్కడిదాకా చేరేందుకు ఆమె ఎంతగా శ్రమించిందో ఈ విజయం ద్వారా తెలిసిపోతోంది. ఎన్నో కష్టాలను అధిగమించి ఆమె ఇక్కడికి వచ్చింది. వినేష్ ఫొగట్ పతకం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.'అని నీరజ్ చోప్రా చెప్పుకొచ్చాడు.

రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డబ్ల్యూఎఫ్‌ఐ) మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషన్ చరణ్ సింగ్‌కు వ్యతిరేకంగా మహిళా రెజ్లర్లు చేపట్టిన ఉద్యమంలో వినేష్ ఫోగట్ కీలక పాత్ర పోషించింది. సహచర రెజ్లర్లు సాక్షి మాలిక్, బజరంగ్ పూనియాలతో కలిసి బ్రిజ్‌ భూషన్‌పై పెద్ద ఉద్యమమే చేసింది. ఈ క్రమంలో పోలీసుల చేత అనేక దెబ్బలు తిన్నది. సోషల్ మీడియా వేదికగా ఎన్నో అవమానాలు, ట్రోల్స్, మానసిక హింసను ఎదుర్కొన్నది. రెజ్లర్ల పోరాటంతో బ్రిజ్ భూషణ్‌పై కేసు నమోదవ్వగా.. అతను అధ్యక్ష పదవికి రాజీనామ చేశాడు. కానీ తన సహచరుడినే మళ్లీ అధ్యక్షుడు అయ్యేలా పావులు కదిపాడు.

Story first published: Tuesday, August 6, 2024, 22:02 [IST]
Other articles published on Aug 6, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+