Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Paris Olympics 2024: నిరాశపర్చిన మీరాభాయి చాను.. తృటిలో చేజారిన పతకం!

పారిస్ ఒలింపిక్స్ 2024లో పతక అంచనాలతో బరిలోకి దిగిన భారత వెయిట్‌లిఫ్టర్ మీరాభాయి చాను తీవ్రంగా నిరాశపరిచింది. టోక్యో ఒలింపిక్స్ 2020లో రజతంతో మెరిసిన మీరాభాయి చాను ఈ సారి మాత్రం నాలుగో స్థానంలో నిలిచి తృటిలో పతకాన్ని చేజార్చుకుంది. స్నాచ్‌లో 88 కేజీలు ఎత్తిన మీరాభాయి చాను.. క్లీన్ అండ్ జర్క్‌లో 111 కేజీలు ఎత్తి మొత్తం 199 కేజీలతో నాలుగో స్థానానికి పరిమితమైంది.

స్నాచ్‌లో మీరాభాయి చాను తొలి ప్రయత్నంలో 85 కేజీల బరువును సునాయసంగా ఎత్తింది. రెండో ప్రయత్నంలో 88 కేజీల బరువును ఎత్తడంలో విఫలమైన మీరాభాయి చాను మూడో ప్రయత్నంలో మాత్రం సునాయసంగా పూర్తి చేసింది. క్లీన్ జర్క్‌లో మీరాభాయి చాను తొలి ప్రయత్నంలో 111 కేజీలు ఎత్తలేకపోయింది. క్లీన్‌ను పూర్తి చేసిన చాను.. జర్క్‌లో మాత్రం తడబడి విఫలమైంది.

Mirabai Chanu finishes fourth in weightlifting

రెండో ప్రయత్నంలో 111 కేజీలను పూర్తి చేసింది. నాలుగో ప్రయత్నంలో 114 కేజీలకు ప్రయత్నించి ఛాను క్లీన్‌ను పూర్తి చేసినా.. జర్క్ ఇవ్వడంలో తడబడి విఫలమైంది. దాంతో 199 కేజీలతో నాలుగో స్థానానికి పరిమితమైంది.

చైనా వెయిట్ లిఫ్టర్ హౌజిహూ వరల్డ్ రికార్డ్ 206 కేజీల బరువెత్తి బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. స్నాచ్‌లో 89 కేజీలు ఎత్తిన హౌజిహూ.. క్లీన్ అండ్ జర్క్‌లో 117 కేజీలు ఎత్తి చరిత్ర సృష్టించింది. రోమానియా వెయిట్‌ లిఫ్టర్ మిహేలా వాలెంటినా 205 కేజీలతో రెండో స్థానంలో నిలిచి రజతం కైవసం చేసుకుంది. స్నాచ్‌లో 91 కేజీలు ఎత్తిన మిహేలా.. క్లీన్ అండ్ జర్క్‌లో 112 కేజీలు ఎత్తింది.

థాయ్‌లాండ్ ప్లేయర్ ఖంబావో సురోద్చన‌ 200 కేజీలతో మూడో స్థానంలో నిలిచి బ్రాంజ్ మెడల్ గెలిచింది. స్నాచ్‌లో 88 కేజీలు ఎత్తిన సురోద్చన.. క్లీన్ అండ్ జర్క్‌లో 112 కేజీలు ఎత్తి బ్రాంజ్ మెడల్ సాధించాడు.

Story first published: Thursday, August 8, 2024, 1:22 [IST]
Other articles published on Aug 8, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+