పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత టేబుల్ టెన్నిస్ స్టార్ మనికా బాత్రా పోరాటం ముగిసింది. ప్రిక్వార్టర్స్‌లో జపాన్‌కు చెందిన మియు హిరానో చేతిలో మనికా ఓటమిపాలైంది. సంచలన ప్రదర్శనతో సింగిల్స్‌లో ప్రీక్వార్టర్స్ చేరిన తొలి భారత మహిళా టేబుల్ టెన్నిస్ ప్లేయర్‌గా చరిత్రకెక్కిన మనికా బాత్రా కీలక పోరులో మాత్రం తీవ్రంగా నిరాశపరిచింది.
బుధవారం జరిగిన టేబుల్ టెన్నిస్ మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో మనికా 6-11, 9-11, 14-12, 8-11, 6-11 తేడాతో వరల్డ్ నెంబర్ 8 మియు హిరానో చేతిలో ఖంగుతిన్నది. ఐదు సెట్లలో మనికా ఒకే ఒక్కదాంట్లో విజయం సాధించింది. జపాన్ ప్లేయర్‌కు మనికా కనీస పోటీ ఇవ్వలేకపోయింది. తొలి సెట్‌లో దారుణంగా విఫలమైన మనికా.. రెండో సెట్‌లో కాస్త ప్రతిఘటించింది. మూడో సెట్‌లో అత్భుతంగా పుంజుకొని విజయం సాధించింది. కానీ నాలుగో సెట్, చివరి సెట్‌లో చిత్తుగా ఓడి మ్యాచ్‌ను చేజార్చుకుంది.

శ్రీజ ముందంజ
మరో భారత టేబుల్ టెన్నిస్ ప్లేయర్, తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ ప్రీక్వార్టర్స్‌కు అర్హత సాధించింది. బుధవారం జరిగిన రౌండ్ 32 మ్యాచ్‌లో శ్రీజ 4-2 తేడాతో సింగపూర్ ప్లేయర్ జియాన్‌ను ఓడించింది. మొత్తం 6 సెట్ల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో శ్రీజ 9-11, 12-10, 11-4, 11-5, 10-12, 12-10 తేడాతో శ్రీజ విజయం సాధించింది.
తొలి సెట్‌ను తృటిలో చేజార్చుకున్న శ్రీజ.. రెండో సెట్‌లో పోరాడి గెలిచింది. మూడు, నాలుగు సెట్లలో మాత్రం శ్రీజ అవోకగా విజయం సాధించింది. ఐదో సెట్‌లో సింగపూర్ ప్లేయర్ విజయం సాధించగా.. చివరి సెట్‌లో శ్రీజ గెలుపొందింది. ఈ గెలుపుతో ఒలింపిక్స్ రౌండ్ 16లోకి ప్రవేశించిన రెండో భారత క్రీడాకారిణిగా శ్రీజ రికార్డ్ సాధించింది. ఇప్పటికే మనికా బాత్రా రౌండ్ 16కు అర్హత సాధించిన విషయం తెలిసిందే.
మిశ్రమ ఫలితాలు..
పారా ఒలింపిక్స్ 2024లో బుధవారం భారత్‌కు మిశ్రమ ఫలితాలు దక్కాయి. బ్యాడ్మింటన్‌లో పీవీ సింధు, లక్ష్యసేన్ ప్రీక్వార్టర్స్‌కు అర్హత సాధించగా.. టేబుల్ టెన్నిస్‌లో తెలంగాణ అమ్మాయి శ్రీజ ఆకుల సత్తా చాటింది. ప్రీక్వార్టర్స్‌కు అర్హత సాధించి ఈ ఘనతను అందుకున్న రెండో టీటీ ప్లేయర్‌గా చరిత్రకెక్కింది. బాక్సింగ్ లోవ్లినా బర్గోహైన్ అసాధారణ ప్రదర్శనతో క్వార్టర్ ఫైనల్ చేరి పతకానికి అడుగు దూరంలో నిలిచింది.
మరో విజయం సాధిస్తే లవ్లీనాకు కాంస్యం ఖాయం అవుతోంది. షూటింగ్‌లో స్వప్నిల్ కుసాలే ఫైనల్‌కు అర్హత సాధించాడు. పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ ఈవెంట్ క్వాలిఫికేషన్ రౌండ్‌లో సత్తా చాటిన అతను మెడల్ ఈవెంట్‌కు దూసుకెళ్లాడు. భారత ఆర్చర్ దీపికా కుమారి ప్రీక్వార్డర్ ఫైనల్‌కు అర్హత సాధించింది.