Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Paris Olympics 2024: నిఖత్ జరీన్ కీలక మ్యాచ్.. రేపటి భారత షెడ్యూల్ ఇదే!

పారా ఒలింపిక్స్ 2024లో బుధవారం భారత అథ్లెట్లు దుమ్మురేపారు. బ్యాడ్మింటన్‌లో పీవీ సింధు, లక్ష్యసేన్ ప్రీక్వార్టర్స్‌కు అర్హత సాధించగా.. టేబుల్ టెన్నిస్‌లో తెలంగాణ అమ్మాయి శ్రీజ ఆకుల సత్తా చాటింది. ప్రీక్వార్టర్స్‌కు అర్హత సాధించి ఈ ఘనతను అందుకున్న రెండో టీటీ ప్లేయర్‌గా చరిత్రకెక్కింది. బాక్సింగ్ లోవ్లినా బర్గోహైన్ అసాధారణ ప్రదర్శనతో క్వార్టర్ ఫైనల్ చేరి పతకానికి అడుగు దూరంలో నిలిచింది.

మరో విజయం సాధిస్తే లవ్లీనాకు కాంస్యం ఖాయం అవుతోంది. షూటింగ్‌లో స్వప్నిల్ కుసాలే ఫైనల్‌కు అర్హత సాధించాడు. పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ ఈవెంట్‌ క్వాలిఫికేషన్ రౌండ్‌లో సత్తా చాటిన అతను మెడల్ ఈవెంట్‌కు దూసుకెళ్లాడు. భారత ఆర్చర్ దీపికా కుమారి ప్రీక్వార్డర్ ఫైనల్‌కు అర్హత సాధించింది.

Paris Olympics 2024 India s schedule for August 1 Thursday Big day for Nikhat Zareen

గురువారం కూడా భారత్ అథ్లెట్లకు కీలకమైన ఈవెంట్స్ ఉన్నాయి. భారత బాక్సర్, వరల్డ్ ఛాంపియన్ నిఖత్ జరీన్ కీలక మ్యాచ్ ఆడనుంది. మహిళల 50 కేజీల విభాగంలో టాప్ సీడ్, చైనా బాక్సర్ వు యుతో నిఖత్ జరీన్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో నిఖత్ జరీన్ విజయం సాధిస్తే మెడల్ సాధించేందుకు ఆమెకు మార్గం సుగుమమవుతోంది. భారత పురుషుల హాకీ టీమ్.. బెల్జియంతో కీలక మ్యాచ్ ఆడనుంది.

ఆగస్ట్ 1(గురువారం) భారత షెడ్యూల్ ఇదే

బాక్సింగ్
మహిళల 50 కేజీల విభాగం: నిఖతర్ జరీన్ X వు యు(చైనా)

అథ్లెటిక్స్
పురుషుల 20 కిలోమీటర్ల నడక రేస్- ఫైనల్: ఆకాశ్‌దీప్ సింగ్, వికాష్ సింగ్, పరమ్‌జీత్ సింగ్ బిస్త్- ఉదయం 11 గంటల నుంచి

మహిళల 20 కిలోమీటర్ల నడక రేస్- ఫైనల్: మధ్యాహ్నం 12.50 గంటల నుంచి

గోల్ఫ్
పురుషుల వ్యక్తిగత స్ట్రోక్ ప్లేయర్-రౌండ్ 1: శుభాంకర్ శర్మ-గగన్‌జీత్ భుల్లర్-మధ్యాహ్నం 12.30 గంటల నుంచి

హాకీ
భారత్ వర్సెస్ బెల్జియం-పురుషుల గ్రూప్ బీ పోరు- మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభం

ఆర్చరీ
పురుషుల వ్యక్తిగత 1/32 ఎలిమినేషన్ రౌండ్-ప్రవిన్ రమేశ్ జాదవ్(భారత్) వర్సెస్ కావ్ వెంచావ్(చైనా)- మధ్యాహ్నం 2.31 గంటలకు ప్రారంభం

మహిళల వ్యక్తిగత ప్రీ క్వార్టర్ ఫైనల్స్: దీపిక కుమారి వర్సెస్ టీబీఏ

షూటింగ్:

మహిళల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్, క్వాలిఫికేషన్: అంజుమ్ మౌద్గిల్, సిఫ్ట్ కౌర్ సమ్రా-మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభం

పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్- స్వప్నిల్ కుశాలే

సెయిలింగ్
పురుషుల డింగీ రేస్1: విష్ణు శరవణ్-మధ్యాహ్నం 3.45 ప్రారంభం

మహిళల డింగీ రేస్ 1: నేత్రా కుమనన్-రాత్రి 7 గంటలకు ప్రారంభం

Story first published: Wednesday, July 31, 2024, 19:39 [IST]
Other articles published on Jul 31, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+