Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Paris Olympics 2024: నేటి భారత షెడ్యూల్ ఇదే.. !

పారిస్ ఒలింపిక్స్ 2024లో తొలి రోజు భారత్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. మెడల్ ఈవెంట్ షూటింగ్‌లో నిరాశ తప్పలేదు. మహిళా షూటర్ మను భాకర్ మాత్రం అద్భుత ప్రదర్శనతో ఫైనల్ చేరి మెడల్‌పై ఆశలు రేకెత్తించింది. 20 ఏళ్ల తర్వాత 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో ఫైనల్ చేరిన మహిళా షూటర్‌గా మను భాకర్ నిలిచింది.

ఆదివారం జరిగే ఫైనల్లో మను భాకర్ ఇదే జోరును కొనసాగిస్తే టీమిండియాకు పతకం సొంతమవుతోంది. ఆదివారమైన రెండో రోజు పోటీల్లో మను భాకర్‌తో పాటు మరో పతకం భారత్‌ను ఊరిస్తోంది. ఇప్పటి దాకా భారత్‌కు మెడల్ లేని ఆర్చరీలో బోణీ కొట్టేందుకు మహిళల ఆర్చరీ టీమ్ సిద్దంగా ఉంది.

Paris Olympics 2024 India s Full Schedule for July 28 Events Timings Athletes and More details

ఒలింపిక్స్‌లో ఆర్చరీ మొదలై 36 ఏళ్ల అవుతున్నా.. భారత్‌ ఒక్క మెడల్ సాధించలేకపోయింది. ప్రతిసారీ మన ఆర్చర్లు ఒలింపిక్స్‌కు వెళ్లడం.. తీవ్రంగా నిరాశపర్చడం జరుగుతోంది. కానీ ఈసారి భారీ అంచనాలతో పారిస్‌లో అడుగుపెట్టిన ఆర్చర్లు.. క్వాలిఫికేషన్స్ రౌండ్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చారు. ఇటు మహిళలు, అటు పురుషులు క్వార్టర్స్‌కు అర్హత సాధించారు. మరో రెండు విజయాలు సాధిస్తే పతకాలు ఖాయం అవుతాయి. ఆదివారం జరిగే క్వార్టర్స్‌లో భారత మహిళల ఆర్చరీ టీమ్.. ఫ్రాన్స్, నెదర్లాండ్స్ మధ్య విజేతతో తలపడనుంది. క్వార్టర్స్‌లో విజయం సాధిస్తే కొరియాతో తలపడుతోంది. ఈ విభాగంలో మెడల్ ఈవెంట్స్ ఈ రోజే(ఆదివారం) జరగనున్నాయి.

గోల్డ్ మెడల్ లక్ష్యంగా పారిస్‌లో అడుగుపెట్టిన భారత మహిళా బాక్సర్ నిఖత్ జరీన్ నేడే తొలి మ్యాచ్ ఆడనుంది. మహిళల 50 కేజీల విభాగంలో మ్యాక్సీ కరీనా(జర్మనీ)తో నిఖత్ తలపడుతోంది.

ఒలింపిక్స్‌లో నేటి భారత షెడ్యూల్..

మెడల్ ఈవెంట్స్:

షూటింగ్: 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మహిళల ఫైనల్(మనుబాకర్)-మధ్యాహ్నం 3.30

ఆర్చరీ: మహిళల జట్టు క్వార్టర్స్(అంకిత, దీపిక, భజన్)-సాయంత్ర 5.45, సెమీస్- సాయంత్రం 7.17, మెడల్ రౌండ్స్- 8.18 గంటలకు

ఇతర ఈవెంట్స్:

రోయింగ్: పురుషుల సింగిల్ స్కల్స్ (రేపి చేజ్-2)-బాల్‌రాజ్-మధ్యాహ్నం 1.18 గంటలకు

టేబుల్ టెన్నిస్:
మహిళల సింగిల్స్ రెండో రౌండ్: ఆకుల శ్రీజ X క్రిస్టినా, మనిక X హర్సీ- మధ్యాహ్నం 12.15 గంటలకు

పురుషుల సింగిల్స్ రెండో రౌండ్(శరత్ X డెని కొజుల్)-మధ్యాహ్నం 3 గంటలకు

షూటింగ్:
10 మీటర్ల ఎయిర్ రైఫిల్ క్వాలిఫికేషన్ మహిళలు: వలరివన్, రమిత- మధ్యాహ్నం 12.45 గంటలకు

పురుషులు(సందీప్, అర్జున్)- మధ్యాహ్నం 2.45 గంటలకు

బ్యాడ్మింటన్
మహిళల సింగిల్స్(సింధు X ఫాతిమాత్)-మధ్యాహ్నం 12.50 గంటలకు

పురుషుల సింగిల్స్(హెచ్‌ఎస్ ప్రణయ్ X ఫాబియన్) రాత్రి 8 గంటలకు

స్విమ్మింగ్: పురుషుల 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ హీట్-2(శ్రీహరి)-మధ్యాహ్నం 3.15, మహిళ 200 మీటర్ల ఫ్రీస్టైల్ హీట్-1(దినిది)-మధ్యాహ్నం 3.30 గంటలకు

బాక్సింగ్:
మహిళల 50 కేజీలు తొలి రౌండ్: నిఖత్ జరీన్ X మ్యాక్సీ కరీన) మధ్యాహ్నం 3.50 గంటలకు

Story first published: Sunday, July 28, 2024, 10:35 [IST]
Other articles published on Jul 28, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+