Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Paris Olympics 2024: బరిలో గోల్డెన్ భాయ్ నీరజ్ చోప్రా.. రేపటి భారత షెడ్యూల్ ఇదే!

పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత అథ్లెట్ల నిరాశజనక ప్రదర్శన కొనసాగుతోంది. సోమవారం కూడా భారత్‌కు ఒక్క పతకం రాలేదు. కాంస్య పోరు బరిలో దిగిన బ్యాడ్మింటన్ స్టార్ లక్ష్యసేన్ తీవ్రంగా నిరాశపరిచాడు. మలేషియా షట్లర్ లీ జి జియా చేతిలో ఓడి పతకాన్ని చేజార్చుకున్నాడు. షూటింగ్‌లో స్కీట్ మిక్స్‌డ్ ఈవెంట్‌లో కాంస్యపతక పోరుకు అర్హత సాధించిన మహేశ్వరి చౌహన్, అనంత్ జిత్ సింగ్‌లు కూడా తీవ్రంగా నిరాశపరిచారు. చైనాతో జరిగిన కాంస్యపోరులో ఓటమిపాలై నాలుగో స్థానంలో నిలిచారు.

టేబుల్ టెన్నిస్‌లో మనికా బాత్రా, ఆకుల శ్రీజ, కామత్ అర్చనా గిరీష్‌లతో కూడిన భారత మహిళల టేబుల్ టెన్నిస్ టీమ్ క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించింది. ప్రీ క్వార్టర్‌లో భారత్ 3-2 తేడాతో రొమానియోను ఓడించింది. భారత మహిళా నిషా దహియా క్వార్టర్ ఫైనల్ చేరింది.

Paris Olympics 2024 India s schedule for August 6 Neeraj Chopra in Action

మంగళవారం భారత్‌కు కీలక ఈవెంట్స్ ఉన్నాయి. భారత గోల్టెన్ భాయ్, టోక్యో ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా.. బరిలోకి దిగనున్నాడు. అతనితో పాటు మరో బళ్లెం వీరుడు కిషోర్ జేనా కూడా క్వాలిఫికేషన్ రౌండ్‌లో పోటీ పడనున్నాడు. మహిళల టేబుల్ టెన్నిస్ టీమ్ క్వార్టర్ ఫైనల్లో చైనాతో తలపడనుంది. స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్ బరిలోక దిగనుంది. భారత హాకీ టీమ్ సెమీస్‌లో జర్మనీతో తలపడనుంది.

రేపటి భారత షెడ్యూల్..

టేబుల్ టెన్నిస్

పురుషుల టేబుల్ టెన్నిస్ టీమ్(శరత్ కమల్, హర్మీత్ దేశాయ్, మనవ్ థక్కర్) రౌండ్ 16 మ్యాచ్: ఇండియా వర్సెస్ చైనా- మధ్యాహ్నం 1.30 గంటలకు

మహిళల టేబుల్ టెన్నిస్ టీమ్( మనికా బాత్రా, ఆకుల శ్రీజ, కామత్ అర్చనా గిరీష్‌) క్వార్టర్ ఫైనల్: ఇండియా వర్సెస్ యూఎస్ఏ/జర్మనీ- సాయంత్రం 6.30 గంటలకు

అథ్లెటిక్స్

జావెలిన్ త్రో- గ్రూప్-ఏ క్వాలిఫికేషన్ -కిశోర్ జేనా- మధ్యాహ్నం 1.50 గంటలకు

జావెలిన్ త్రో- గ్రూప్-బీ క్వాలిఫికేషన్ - నీరజ్ చోప్రా- మధ్యాహ్నం 3.20 గంటలకు

మహిళల 400 మీటర్లు- రేప్‌చేజ్ రౌండ్- కిరణ్ పహల్- మధ్యాహ్నం 2.50 నిమిషాలకు

రెజ్లింగ్
మహిళల 50 కేజీలఫ్రీస్టైల్ ప్రీ క్వార్టర్స్, క్వార్టర్ ఫైనల్, సెమీఫైనల్స్- వినేష్ ఫోగట్- మధ్యాహ్నం 3 గంటల నుంచి

హాకీ
సెమీఫైనల్: భారత్ వర్సెస్ జెర్మనీ-రాత్రి 10.30 గంటలకు

Story first published: Monday, August 5, 2024, 19:57 [IST]
Other articles published on Aug 5, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+