Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Paris Olympics 2024: బరిలో మను భాకర్ .. రేపటి భారత షెడ్యూల్ ఇదే!

పారా ఒలింపిక్స్ 2024లో గురువారం భారత్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. భారత షూటర్ స్వప్నిల్ కుసాలే కాంస్య పతకంతో సంతోష పర్చగా.. స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ తీవ్రంగా నిరాశపరిచింది. టేబుల్ టెన్నిస్‌లో సంచలన ప్రదర్శనతో ప్రీక్వార్టర్స్ చేరిన తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ పోరాటం కూడా ముగిసింది.

బ్యాడ్మింటన్ డబుల్స్ స్టార్ సాత్విక్ సాయిరాజ్ రాంకీ రెడ్డి-చిరాగ్ శెట్టిలకు కూడా క్వార్టర్స్‌లోనే చుక్కెదురైంది. భారత్‌కే చెందిన హెచ్‌ఎస్ ప్రణయ్‌ను ఓడించి లక్ష్యసేన్ క్వార్టర్ ఫైనల్స్‌కు అర్హత సాధించాడు. భారత పురుషుల హాకీ టీమ్ తొలి ఓటమిని ఎదుర్కొంది. బెల్జియం చేతిలో ఖంగుతిన్నది. స్వప్నిల్ కుసాలే పతకం గెలవడం మినహా.. గురువారం భారత్‌ అథ్లెట్లు తీవ్రంగా నిరాశపరిచారు.

Paris Olympics 2024 India s schedule for August 2 Friday Big day for Manu Bhaker and Lakshya Sen

శుక్రవారం భారత్‌కు కీలక ఈవెంట్స్ ఉన్నాయి. ఇప్పటికే రెండు పతకాలు అందించిన మను భాకర్.. ముచ్చటగా మూడో పతకం కోసం బరిలోకి దిగుతోంది. మహిళల 25 మీటర్ల రైఫిల్ వ్యక్తిగత విభాగంలో ఆమె తలపడుతోంది. ఈ విభాగంలో పతకం గెలిస్తే మూడు మెడల్స్ సాధించిన అథ్లెట్‌గా సరికొత్త చరిత్రను లిఖించనుంది.

మను భాకర్ షూటింగ్ ఈవెంట్‌తో పాటు భారీ హాకీ మ్యాచ్, అథ్లెటిక్స్ షాట్‌పుల్ క్వాలిఫికేషన్, బ్యాడ్మింటన్ మ్యాచ్‌లు ఉన్నాయి. భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్ క్వార్టర్ ఫైనల్లో చౌ టైన్-చెన్(చైనీస్ తైపీ)తో తలపడనున్నాడు.

రేపటి భారత షెడ్యూల్ ఇదే..

ఆర్చరీ: మిక్స్‌డ్ టీమ్ రౌండ్ 16 ఫైనల్స్- మధ్యాహ్నం 1 గంటలకు

అథ్లెటిక్స్: పురుషుల షాట్‌పుట్ క్వాలిఫికేషన్- ఉదయం 11.40 గంటలకు

బ్యాడ్మింటన్: పురుషుల, మహిళల డబుల్స్ సెమీఫైనల్స్, పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్- మధ్యాహ్నం 12 గంటలకు

పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్: లక్ష్యసేన్ X చౌ టైన్-చెన్ (చైనీస్ తైపీ)

బాక్సింగ్: మహిళల 57 కేజీ రౌండ్ ఆఫ్ 16, పురుషుల 51 కేజీ క్వార్టర్ ఫైనల్స్- రాత్రి 7 గంటల నుంచి)

గోల్ఫ్: పురుషుల రెండో రౌండ్- మధ్యాహ్నం 12.30 గంటలకు

హాకీ: భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా గ్రూప్ బీ మ్యాచ్- సాయంత్ర 4.45 గంటలకు

షూటింగ్:

స్కీట్ పురుషుల క్వాలిఫికేషన్ డే 1, 25 మీటర్ల పిస్టోల్ మహిళల క్వాలిఫయర్స్-మను భాకర్ -మధ్యాహ్నం 12.30 గంటలకు

50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ మహిళల ఫైనల్( మధ్యాహ్నం ఒంటి గంటకు)

Story first published: Thursday, August 1, 2024, 19:43 [IST]
Other articles published on Aug 1, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+