Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Paris Olympics 2024: బరిలో నీరజ్ చోప్రా, హాకీ టీమ్.. రేపటి భారత షెడ్యూల్ ఇదే!

పారిస్ ఒలింపిక్స్ 2024లో బుధవారం భారత్‌కు ఊహించని షాక్ తగిలింది. అసాధారణ ప్రదర్శనతో ఫైనల్ చేరి గోల్డ్ మెడల్ ఆశలు రేకెత్తించిన స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్ అనూహ్యంగా డిస్‌క్వాలిఫై అయ్యింది. మహిళల 50 కేజీల ఫ్రీ‌స్టైల్ విభాగంలో పోటీ పడిన ఆమె.. ఫైనల్‌కు ముందు 150 గ్రాములు అధిక బరువు ఉండటంతో నిబంధనల ప్రకారం అనర్హత వేటు వేసారు. దాంతో ఆమెకు ఏ పతకం రాలేదు.

మహిళల టేబుల్ టెన్నిస్ టీమ్ క్వార్టర్స్ జర్మనీ చేతిలో ఓటమిపాలైంది. రెజ్లింగ్ 53 కేజీల విభాగంలో అంతిమ్ పంఘల్ ఫస్ట్ రౌండ్‌లోనే టర్కీ రెజ్లర్ చేతిలో ఓటమిపాలైంది. అథ్లెటిక్స్‌లో భారత్‌కు నిరాశే ఎదురైంది. హైజంపర్ స్వప్నిల్ కుసారే ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయింది. మహిళల జావెలిన్ త్రోలో అన్ను రాణి నిరాశపర్చింది.

Paris Olympics 2024 India s schedule for August 8 Neeraj Chopra and Hockey India in Action

బుధవారం ప్రతికూల ఫలితాలు ఎదురైనా.. గురువారం భారత్‌కు కీలక మ్యాచ్‌లు ఉన్నాయి. రెండు మెడల్స్ ఈవెంట్స్‌లో భారత అథ్లెట్లు పోటీ పడనున్నారు. పురుషుల జావెలిన్ త్రో ఫైనల్లో గోల్డెన్ భాయ్ నీరజ్ చోప్రా బరిలోకి దిగనుండగా.. భారత హాకీ టీమ్ కాంస్యపోరులో స్పెయిన్‌తో అమీతుమీ తేల్చుకోనుంది.

రేపటి భారత షెడ్యూల్ ఇదే..!

గోల్ఫ్
మహిళల వ్యక్తిగత స్ట్రోక్ ప్లే-రౌండ్ 2- దిక్ష దగర్- మధ్యాహ్నం 12.30 గంటలకు

మహిళల వ్యక్తిగత స్ట్రోక్ ప్లే-రౌండ్ 2- అదితి అశోక్- మధ్యామ్నం 2.47 గంటలకు

అథ్లెటిక్స్
మహిళల 100 మీటర్ల హర్డల్స్-రీప్‌చేజ్-హీట్ 1- జ్యోతీ ఎర్రాజీ- మధ్యాహ్నం 2.05 గంటలకు

పురుషుల జావెలిన్ త్రో ఫైనల్-నీరజ్ చోప్రా- రాత్రి 11.55 గంటలకు

హాకీ
కాంస్య పోరు: భారత్ వర్సెస్ స్పెయిన్- సాయంత్రం 5.30 గంటలకు

రెజ్లింగ్
మహిళల 57 కేజీల ఫ్రీ‌స్టైల్ 1/8 ఫైనల్స్- అన్షు మాలిక్ వర్సెస్ హెలెన్ మరౌలిస్(అమెరికా)- మధ్యాహ్నం 3 గంటలకు

మహిళల 57 కేజీల ఫ్రీ‌స్టైల్ 1/8 ఫైనల్స్- అమన్ సెహ్రావత్ వర్సెస్ వ్లాద్‌మిర్ ఇగోరోవ్(మెకోడోనియా)- మధ్యాహ్నం 3 గంటలకు

మహిళల 57 కేజీల ఫ్రీ‌స్టైల్ 1/4 ఫైనల్స్(ఫస్ట్ రౌండ్ గెలిస్తే)- అన్షు మాలిక్ వర్సెస్ టీబీడీ- సాయంత్రం 4.20 గంటలకు

మహిళల 57 కేజీల ఫ్రీ‌స్టైల్ 1/4 ఫైనల్స్- అమన్ సెహ్రావత్(గెలిస్తే) వర్సెస్ టీబీడీ- సాయంత్రం 4.20 గంటలకు

మహిళల 57 కేజీల ఫ్రీ‌స్టైల్ సెమీఫైనల్( గెలిస్తే)- అన్షు మాలిక్ వర్సెస్ టీబీడీ- రాత్రి 10.25 గంటలకు

మహిళల 57 కేజీల ఫ్రీ‌స్టైల్ సెమీ ఫైనల్స్- అమన్ సెహ్రావత్(గెలిస్తే) వర్సెస్ టీబీడీ- రాత్రి 10.25 గంటలకు

Story first published: Wednesday, August 7, 2024, 20:23 [IST]
Other articles published on Aug 7, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+