Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Paris Olympics 2024: బరిలో మీరా భాయ్ చాను.. రేపటి భారత షెడ్యూల్ ఇదే!

పారిస్ ఒలింపిక్స్ 2024లో మంగళవారం భారత్‌కు మిశ్రమ ఫలితాలు దక్కాయి. మెడల్ ఈవెంట్స్ ఏం లేకపోవడంతో పతకం రాలేదు. కానీ భారత బళ్లెం వీరుడు, డిఫెండింగ్ ఛాంపియన్ నీరజ్ చోప్రా ఫైనల్‌కు అర్హత సాధించాడు. క్వాలిఫికేషన్ రౌండ్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చి పసిడి ఆశలు రేకేత్తించాడు. మరో జావెలిన్ త్రోయర్ కిశోర్ జెనా మాత్రం తీవ్రంగా నిరాశపరిచాడు. 12వ స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయాడు.

పురుషుల టెబుల్ టెన్నిస్ టీమ్ చైనా చేతిలో చిత్తవ్వగా.. రెజ్లింగ్‌లో వినేష్ ఫోగాట్ సత్తా చాటింది. సంచలన ప్రదర్శనతో సెమీఫైనల్ చేరి ఈ ఘనత సాధించిన తొలి మహిళా రెజ్లర్‌గా చరిత్ర సృష్టించింది. మరో విజయం సాధిస్తే వినేష్ ఫోగాట్‌కు పతకం ఖాయం కానుంది.

Paris Olympics 2024 India s schedule for August 7 Mirabai Chanu and Vinesh Phogat in Action

బుధవారం భారత షెడ్యూల్ ఇదే

అథ్లెటిక్స్
మారథన్ రేస్ వాకింగ్ మిక్స్‌డ్ రిలే ఫైనల్: ప్రియాంక గోస్వామి-సురాజ్ పన్వాల్- ఉదయం 11 గంటలకు

పురుషుల హైజంప్ క్వాలిఫికేషన్ గ్రూప్-బీ: సర్వేష్ కుశారే- మధ్యాహ్నం 1.35 గంటలకు

మహిళల జావిలిన్ త్రో క్వాలిఫికేషన్ గ్రూప్-ఏ: అన్ను రాణి-మధ్యాహ్నం 1.55 గంటలకు

మహిళల 100 మీటర్ల హర్డల్స్ తొలి రౌండ్-హీట్ 4: జ్యోతి యెర్రాజీ-మధ్యాహ్నం 2.09 గంటలకు

పురుషుల ట్రిపుల్ జంప్ క్వాలిఫికేషన్: అబ్దుల్లా అమూబాకర్(గ్రూప్-బీ), ప్రవీణ్ చిత్రవెల్(గ్రూప్-ఏ)

పురుషుల 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్ ఫైనల్: అవినాష్ సాబ్లే-అర్థ రాత్రి 1.13 గంటలకు

గోల్ఫ్
మహిళల వ్యక్తిగత స్ట్రోక్ ప్లే-రౌండ్ 1: అదితి అశోక్, దీక్ష దగర్-మధ్యాహ్నం 12.30 గంటలకు

టేబుల్ టెన్నిస్
మహిళల టీమ్ క్వార్టర్ ఫైనల్: ఇండియా వర్సెస్ జర్మనీ

రెజ్లింగ్
మహిళల 53 కేజీల ఫ్రీస్టైల్ 1/8 : అంతిమ్ పంఘల్ వర్సెస్ యెత్గిల్(టర్కీ)- మధ్యాహ్నం 3 గంటలకు

మహిళల 53 కేజీల ఫ్రీస్టైల్ 1/4 : అంతిమ్ పంఘల్ వర్సెస్ మరియా(గ్రీస్) లేదా అన్నిక(జర్మనీ) -సాయంత్రం 4.20 గంటలకు

మహిళల 53 కేజీల ఫ్రీస్టైల్ సెమీఫైనల్(గెలిస్తే): అంతిమ్ పంఘల్ వర్సెస్ టీబీడీ- రాత్రి 10.25 గంటలకు

మహిళల 50 కేజీల ఫ్రీస్టైల్- బ్రాంజ్ మెడల్ మ్యాచ్(సెమీస్‌లో ఓడితే): వినేష్ ఫోగట్ వర్సెస్ టీబీడీ- మధ్యాహ్నం 12.20 గంటలకు

మహిళల 50 కేజీల ఫ్రీస్టైల్- గోల్డ్ మెడల్ మ్యాచ్(సెమీస్‌లో గెలిస్తే): వినేష్ ఫోగట్ వర్సెస్ టీబీడీ-మధ్యాహ్నం 12.45 గంటలకు

వెయిట్ లిఫ్టింగ్

మహిళల 49కేజీల కేటగిరి- ఫైనల్- మీరాబాయి చాను- రాత్రి 11 గంటలకు

Story first published: Tuesday, August 6, 2024, 21:41 [IST]
Other articles published on Aug 6, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+