For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Paris Olympics 2024: రేపు భారత్‌కు బిగ్ డే.. బరిలో లవ్లీనా, లక్ష్యసేన్, హాకీ టీమ్! పూర్తి షెడ్యూల్ ఇదే!

పారిస్ ఒలింపిక్స్‌ 2024లో భారత అథ్లెట్ల నిరాశాజనక ప్రదర్శన కొనసాగుతోంది. శనివారం కూడా భారత్‌కు ఒక్క పతకం రాలేదు. భారీ అంచనాలతో బరిలోకి దిగిన భారత షూటర్ మను భాకర్ మరో పతకాన్ని తృటిలో చేజార్చుకుంది. మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో పోటీ పడిన మను భాకర్.. శనివారం జరిగిన ఫైనల్లో నాలుగో స్థానంలో నిలిచి మూడో పతకాన్ని అందుకోలేకపోయింది.

భారత ఆర్చర్లు దీపికా కుమారి, భజన్ కౌర్‌లు తీవ్రంగా నిరాశపరిచాడు. క్వార్టర్ ఫైనల్లో దీపికా కుమారి, ప్రీక్వార్టర్స్‌లో భజన్ కౌర్‌లు ఓటమిపాలయ్యారు. ఇప్పటి వరకు భారత్ 3 కాంస్య పతకాలు గెలవగా.. ఈ మూడు షూటింగ్‌లోనే వచ్చాయి. మను భాకర్ రెండు.. స్వప్నిల్ కుసాలే ఒక పతకం సాధించారు. ఆదివారం భారత్‌కు కీలక మ్యాచ్‌లు ఉన్నాయి.

Paris Olympics 2024 India s schedule for August 4 Big day for Lakshya Sen and Lovlina Borgohain

టోక్యో ఒలింపిక్ బ్రాంజ్ మెడలిస్ట్, మహిళా బాక్సర్ లవ్లీనా బోర్గోహైన్.. క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే లవ్లీనాకు కాంస్య పతకం ఖాయం అవుతోంది. బ్యాడ్మింటన్‌ సింగిల్స్‌లో భారత్ స్టార్ లక్ష్యసేన్ సెమీఫైనల్ మ్యాచ్ ఆడనున్నాడు. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే లక్ష్యసేన్‌కు రజతం కన్ఫామ్ అవుతోంది. ఓడితే కాంస్య పోరు ఆడాల్సి ఉంటుంది. భారత హాకీ టీమ్ క్వార్టర్ ఫైనల్స్‌లో గ్రేట్ బ్రిటన్‌తో ఆడనుంది.

రేపటి భారత పూర్తి షెడ్యూల్ ..

షూటింగ్
25 మీటర్ల ఫైర్ పిస్టోల్ పురుషుల క్వాలిఫికేషన్-స్టేజ్1: విజయ్‌వీర్ సిధు, అనిష్-12.30 గంటలకు

హాకీ:
పురుషుల క్వార్టర్ ఫైనల్స్: భారత్ X గ్రేట్ బ్రిటన్- మధ్యాహ్నం 1.30 గంటలకు

అథ్లెటిక్స్
మహిళలు 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్ రౌండ్ 1: పారుల్ చౌదరీ-మధ్యాహ్నం 1.35 గంటలకు

పురుషుల లాంగ్ జంప్ క్వాలిఫికేషన్-జెస్విన అల్‌డ్రిన్- మధ్యాహ్నం 2.30 గంటలకు

బాక్సింగ్:
మహిళల 75 కేజీల క్వార్టర్‌ఫైనల్స్: లోవ్లినా బోర్గోహైన్ వర్సెస్ లి కియాన్ ఆఫ్ చైనా- మధ్యాహ్నం 3 గంటలకు

బ్యాడ్మింటన్:

పురుషుల సింగిల్స్ సెమీఫైనల్స్: లక్ష్యసేన్ వర్సెస్ విక్టోర్ అక్సెల్సెన్(డెన్మార్క్)-- మధ్యాహ్నం 3.30 గంటలకు

సెయిలింగ్
పురుషుల డింగీ రేస్ 7, 8: విష్ణు శరవణన్- మధ్యాహ్నం 3.35 గంటలకు

మహిళల డింగీ రేస్ 7, 8: నేత్ర కుమనన్- సాయంత్ర 6 గంటలకు

Story first published: Saturday, August 3, 2024, 20:44 [IST]
Other articles published on Aug 3, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+