For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Paris Olympics 2024: అథ్లెట్ కొంపముంచిన జననాంగం.. చేజారిన పతకం! (వీడియో)

పారిస్ ఒలింపిక్స్‌ 2024లో ఫ్రెంచ్ అథ్లెట్ ఆంథోనీ అమ్మిరాటి వింత పరిస్థితి ఎదుర్కొన్నాడు. పురుషుల పోల్ వాల్ట్ ఈవెంట్‌లో అతను తృటిలో పతకాన్ని చేజార్చుకున్నాడు. అతని జననాంగమే పతకాన్ని అందుకోకుండా చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

శనివారం జరిగిన పోల్ వాల్ట్ పోటీల్లో ఆంథోని అమ్మిరాటి నాలుగో స్థానంలో నిలిచి తృటిలో పతకాన్ని చేజార్చుకున్నాడు. స్వీడెన్ అథ్లెట్ డుప్లాంటీస్, నార్వే ప్లేయర్ గుట్టోర్మెసెన్, గ్రీక్ ప్లేయర్ కరాలిస్ 5.75 మీటర్ల ఎత్తును క్లియర్ చేసి టాప్-3లో నిలవగా.. ఆంథోని అమ్మిరాటి 5.60 మీటర్లు మాత్రం దూకి నాలుగో స్థానానికే పరిమితమయ్యాడు.

French pole vaulter failed

5.70 మీటర్లను క్లియర్ చేసే ప్రయత్నంలో అతని జనానంగం అడ్డుగా తగిలింది. దాంతో కామెంటేటర్లు తమ వ్యాఖ్యానంతో నవ్వులు పూయించారు. 'ఫ్రెంచ్ అథ్లెట్ ఆంథోని అమ్మిరాటి.. 5.70 మీటర్ల ఎత్తును క్లియర్ చేయలేకపోయాడు.

అతని శరీరంలో విలువైన ఆస్థి అడ్డుగా తగిలింది'అని ఓ కామెంటేటర్ అనగా.. మరొకరు అతనికి తగిన పరిహారం అందుతుందని జోక్ చేశాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారగా.. నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

పోల్ వాల్ట్ సూపర్ స్టార్ అయిన స్వీడెన్ అథ్లెట్ అర్మాండ్ గుస్తవ్ 5.75 మీటర్లను క్లియర్ చేసి బంగారు పతకాన్ని అందుకున్నాడు. ఈ 24 ఏళ్ల స్వీడెన్ అథ్లెట్ పేరిట 6.24 మీటర్లతో పాటు 6.22 మీటర్ల ఎత్తును క్లియర్ చేసిన వరల్డ్ రికార్డ్ ఉంది.

Story first published: Saturday, August 3, 2024, 23:21 [IST]
Other articles published on Aug 3, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+