Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Paris Olympics 2024: ప్చ్.. దీపికా కుమారి ఓటమి!

పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత ఆర్చర్ల పోరాటం ముగిసింది. ఈ సారి కూడా మెడల్ లేకుండా ఆర్చర్లు ఇంటిదారి పట్టారు. వ్యక్తిగత విభాగంలో క్వార్టర్ ఫైనల్ చేరి అంచనాలు పెంచిన దీపికా కుమారి.. కీలక పోరులో తీవ్రంగా నిరాశపర్చింది. శనివారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో దీపికా కుమారి 4-6 తేడాతో సౌత్ కొరియాకు చెందిన నామ్ సుహ్యెన్ చేతిలో ఓటమిపాలైంది. మరో ఆర్చర్ భజన్ కౌర్ ప్రిక్వార్టర్స్‌లోనే నిష్క్రమించింది.

క్వార్టర్స్ పోరు తొలి సెట్‌ను 28-26తో గెలిచిన దీపిక.. రెండో సెట్‌లో మొదటి బాణాన్ని లక్ష్యానికి కొట్టి 10కి 10 పాయింట్లు సాధించింది. తర్వాత గురి తప్పడంతో ఆరు పాయింట్లే వచ్చాయి. దాంతో రెండో సెట్‌ను కోల్పోయింది. మూడో సెట్‌లో పుంజుకొని 29-28తో గెలిచింది. తర్వాత రెండు సెట్లలో దీపిక స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు.

Paris Olympics 2024 Deepika Kumari Loses 4-6 to Nam Su-hyeon in Archery Quarters

నాలుగో సెట్‌లో రెండు బాణాలకు 10కి 10 పాయింట్లు సాధించిన భారత ఆర్చర్.. ఒకదానికి మాత్రం 7 పాయింట్లే రాబట్టి మూల్యం చెల్లించుకుంది. ఈ సెట్‌లో ప్రత్యర్థి 29 పాయింట్లతో సెట్‌ను కైవసం చేసుకొని 4-4తో స్కోర్ సమం చేసింది. చివరి సెట్‌లో దీపిక వరుసగా 9, 9, 9 పాయింట్లు సాధించగా.. సౌత్ కొరియా ఆర్చర్ 10, 9, 10 పాయింట్లతో పై చేయి సాధించి విజయాన్ని కైవసం చేసుకుంది.

ఒక్క పాయింట్‌తో ఓడిన భజన్ కౌర్..
మహిళల వ్యక్తిగత విభాగం ప్రిక్వార్టర్స్‌లో భజన్ కౌర్ ఒక్క పాయింట్‌ తేడాతో ఓటమిపాలైంది. శనివారమే జరిగిన ఈ పోరులో భజన్ కౌర్ 5-6 తేడాతో ఇండోనేషియాకు చెందిన చోరునిసా చేతిలో ఖంగుతిన్నది. ఇద్దరు ఆర్చర్లు హోరా హోరీగా తలపడటంతో ఐదు సెట్లు ముగిసేసరికి స్కోర్లు 5-5తో సమం అయ్యాయి. దాంతో మ్యాచ్ షూట్ ఆఫ్ రౌండ్‌కు దారి తీసింది. ఇందులో ఇండోనేషియా ఆర్చర్ మెరుగైన ప్రదర్శన చేసి ముందంజ వేసింది.

భజన్ కౌర్ తొలి సెట్‌లో 28-29 ఓడి.. రెండో సెట్‌ను 27-25తో కైవసం చేసుకుంది. మూడో సెట్‌లో 26-28తో వెనుకబడిన భజన్ కౌర్.. నాలుగో సెట్‌లో ఇద్దరూ సమానంగా స్కోర్లు సాధించారు. ఐదో సెట్‌లో భజన్ కౌర్ 27-26తో గెలవడంతో స్కోర్లు 5-5తో సమమయ్యాయి. షూట్ ఆఫ్ రౌండ్‌లో భారత ఆర్చర్ 8 స్కోర్ చేయగా.. ప్రత్యర్థి చోరినిసా 9 స్కోర్‌తో విజేతగా నిలిచి ముందడుగు వేసింది.

Story first published: Saturday, August 3, 2024, 20:03 [IST]
Other articles published on Aug 3, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+