వినేష్ ఫోగట్ డిస్‌క్వాలిఫై.. వారికి మరో ఛాన్స్! షెడ్యూల్ ప్రకటించిన ఒలింపిక్ కమిటీ
భారత స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్‌పై అనర్హత వేటు పడటంతో మహిళల 50 కేజీల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ షెడ్యూల్ పూర్తిగా మారిపోయింది. వినేష్ ఫోగట్ డిస్‌క్వాలిఫైతో ఆమె చేతిలో ఓడిన రెజ్లర్లకు మరో అవకాశం దక్కింది. సెమీఫైనల్లో వినేష్ ఫోగట్ చేతిలో ఓడిన క్యూబా రెజ్లర్ గుజ్మన్ లోపేజ్ ఫైనల్ మ్యాచ్ ఆడనుంది.
తొలి రౌండ్, రెండ్‌లో వినేష్ చేతిలో ఓడిన జపాన్ ప్లేయర్ సుసాకీ , ఉక్రెయిన్‌కు చెందిన ఓక్సాన మధ్య కాంస్య పోరు జరగనుంది. యూనైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ ఫెడరేషన్ రూల్స్ ప్రకారం బరువు ప్రమాణాలను అందుకోని రెజ్లర్లపై అనర్హత వేటు వేస్తారు. అంతేకాకుండా ఆ పోటీల్లో చివరి ర్యాంక్‌ను ఇస్తారు. అంతర్జాతీయ రెజ్లింగ్ నిబంధనల్లోని ఆర్టకల్ 11 ప్రకారం.. వినేశ్ చేతిలో ఓడిన వారికి మరో అవకాశం ఇస్తారు.

ఈ క్రమంలో ఒలింపిక్ కమిటీ షెడ్యూల్‌ను పూర్తిగా మార్చేసింది. వినేశ్ ఫోగట్ సస్పెన్షన్ వ్యవహరంలో సపోర్ట్ స్టాఫ్, భారత అధికారుల అలసత్వం ఉందనే ప్రచారం జోరుగా సాగుతోంది. వినేష్ బరువు ప్రమాణాలకు తగినట్లు లేదని తెలిసిన వెంటనే.. అనారోగ్యా కారణాలు చూపి పోటీ నుంచి తప్పుకుంటే కనీసం రజత పతకమైన దక్కేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అధికారుల అలసత్వం కారణంగా అసాధారణ ప్రదర్శన కనబర్చినా వినేష్ ఫోగట్‌కు పతకం లేకుండా పోయిందని నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications