For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Paris Olympics 2024 కౌంట్ డౌన్ షురూ.. జ్యోతి వెలిగింది!

ప్రపంచ క్రీడా పండుగ పారిస్ ఒలింపిక్స్-2024‌కు కౌంట్‌ డౌన్ షురూ అయ్యింది. మరో 100 రోజుల్లో ఈ మెగా ఈవెంట్‌కు తెరలేవనుంది. ఈ నేపథ్యంలో ఎప్పటిలాగే సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఒలింపిక్స్ పుట్టిల్లు గ్రీస్‌లో మంగళవారం ఒలింపిక్ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం ఘనంగా జరిగింది.

ప్రాచీన సంప్రదాయ వేషధారణలో గ్రీక్ బ్యూటీ మారియా మినా జ్యోతిని వెలిగించింది. వాతవారణ పరిస్థితుల కారణంగా జ్యోతి ప్రజ్వలన సంప్రదాయ రీతిలో జరగలేదు. గ్రీకు ప్రజలు దేవుడిగా ఆరాధించే సూర్యుడి నుంచి వచ్చే కిరణాల సాయంతో జ్యోతిని వెలిగించడం ఆనవాయితీ. సూర్య కిరణాలు ఓ అద్దం మీద పడితే దాని ద్వారా జ్యోతి అంటుకుంటుంది.

Paris Olympics 2024 Countdown is on 100 days to Paris

అయితే మంగళవారం వాతావరణం మబ్బులు కమ్మి ఉండడంతో జ్యోతి ప్రజ్వలన సమయానికి సూర్యుడు రాలేదు. దాంతో మరో జ్యోతి సాయంతో ఒలింపిక్ జ్యోతి ప్రజ్వలన జరిగింది. అయితే ముందు ఒలింపిక్స్ రిహార్సల్ సందర్భంగా సూర్య కిరణాలతోనే జ్యోతి ప్రజ్వలన చేశారు. దాంతో మరో జ్యోతి సాయంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

గ్రీస్ బ్యూటీ మినా జ్యోతిని వెలిగించి టోక్యో ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ గ్రీస్ రోయర్ స్టెఫనోస్ డౌస్కోస్‌కు అందించింది. అతను కౌబెర్టిన్ ప్రాంతానికి చేరుకోగా.. 2004 ఎథెన్స్ ఒలింపిక్స్‌లో మూడు మెడల్స్ సాధించిన స్విమ్మర్ లారి మనౌదా జ్యోతిని అందుకుంది. ఆమె.. యూరోపియన్ యూనియన్ అధికారికి అందించింది.

ఒలింపిక్ జ్యోతి గ్రీస్‌లో 5 వేల కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. మంగళవారం మొదలైన ఈ యాత్ర ఈ నెల 26న ఏథెన్స్‌కు చేరుకుంటుంది. అక్కడ ఒలింపిక్స్ నిర్వహకులకు జ్యోతిని అందజేస్తారు. అనంతరం ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు ఈ జ్యోతిని తీసుకెళ్తారు. పారిస్ ఒలింపిక్స్ ఈసారి అభిమానులు అలరించనున్నాయి.

ఈ సారి బ్రేక్ డ్యాన్స్ క్రీడను కూడా ఒలింపిక్స్‌లో చేర్చారు. డీజే మ్యూజిక్ వినిపిస్తుంటే చిత్రమైన డ్యాన్స్ చేస్తారు. చేతులు కింద పెట్టి కాళ్లు పైకి లేపి సంగీతానికి తగ్గట్లు ఒంటిని రకరకాలుగా వంచడం.. మధ్యలో నిశ్చలంగా ఉండటం వంటి విన్యాసాలు చేస్తారు.

Story first published: Wednesday, April 17, 2024, 11:40 [IST]
Other articles published on Apr 17, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+