Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Imane Khelif: పురుషాంగం లేదు.. గర్భాశయం లేదు! ఒలింపిక్ స్వర్ణ విజేతపై వివాదం!

పారిస్ ఒలింపిక్స్ 2024లో స్వర్ణ పతకం సాధించిన అల్జీరియా మహిళా బాక్సర్ ఇమానె ఖెలిఫ్ పురుషుడని తేలడం సంచలనంగా మారింది. ఒలింపిక్స్ సమయంలోనే ఇమానె ఖెలిప్ మహిళా కాదంటూ ఆమె ప్రత్యర్థులు చేసిన ఆరోపణలను ఒలింపిక్స్ కమిటీ పట్టించుకోలేదు. ఆమెను పోటీలకు అనుమతించడంతో విజేతగా నిలిచి స్వర్ణం సాధించింది. ఆమె బంగారు పతకం గెలిచినా.. ఇమానె జెండర్‌పై సందేహాలు కొనసాగాయి.

ఈ క్రమంలోనే ఇమానె ఖెలిప్ లింగ్ గుర్తింపునకు సంబంధించిన మెడికల్ రిపోర్ట్ లీకవ్వడం.. అందులో ఆమె మహిళ కాదని తేలడం క్రీడా వర్గాలను షాక్‌కు గురి చేసింది. ఇమాన్ ఖెలిఫ్‌కు పురుషుల తరహా శరీరాకృతితో పాటు క్లినికల్ లక్షణాలు ఉన్నాయని ఆ రిపోర్ట్‌లో స్పష్టమైంది. ఈ నివేదికను ఓ ఫ్రెంచ్ జర్నలిస్ట్ బయటపెట్టాడు.

Paris Olympic Gold Medallist Boxer Imane Khelif Identified As Man In Leaked Medical Report

ఇమాన్ ఖెలిఫాకు గర్భాశయం కూడా లేదని, పురుషుల్లో ఉండే XY క్రోమోజోమ్స్ ఉన్నాయని ఆ మెడికల్ రిపోర్ట్‌లో స్పష్టమైంది. ఇమాన్ ఖలీఫ్‌కు అంతర్గత వృషణాలు ఉన్నాయని ఆ మెడికల్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. అయితే ఇమాన్ ఖలీఫ్‌కు 5-ఆల్ఫా రిడక్టేజ్ లోపం ఉందని, ఈ సమస్య మగవారిలో మాత్రం ఉంటుందని ఆ రిపోర్ట్‌లో ప్రస్తావించారు. ఈ లోపం ఉన్న మగవారికి మీసాలు, గడ్డం ఉండవని పేర్కొన్నారు.

ఈ రిపోర్ట్ వెల్లడించిన విషయాలతో తీవ్ర దుమారం రేగుతోంది. ఒలింపిక్ కమిటీపై క్రీడా ప్రేమికులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఆమె స్వర్ణ పతకాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ సైతం ఆమె స్వర్ణాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశాడు.

పారిస్ ఒలింపిక్స్‌లో చైనాకు చెందిన మహిళా బాక్సర్ యంగ్ లూయిపై 5-0‌తో గెలిచి ఖెలిఫ్ స్వర్ణం సాధించింది. ఓ బౌట్‌లో 46 సెకన్లలోనే ప్రత్యర్థిని మట్టికరిపించింది. ఆ సమయంలోనే ఖెలిఫ్ మహిళా కాదంటూ పోటీదారులు ఆరోపించారు. కానీ ఒలింపిక్ కమిటీ పట్టించుకోలేదు.

వాస్తవానికి వరల్డ్ బాక్సింగ్ ఆర్గనైజేషన్ ఇమానె ఖెలిఫ్‌పై 2023లోనే నిషేధం విధించింది. వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ టోర్నీలో పాల్గొనకుండా అనర్హత వేటు వేసింది. వైద్య పరీక్షల్లో అతను పురుషుడని తేలడంతోనే ఈ నిర్ణయం తీసుకుంది. ఆమె ఈ నిర్ణయాన్ని సవాల్ చేయగా.. పారిస్ ఒలింపిక్స్‌కు అనుమతిచ్చారు.

అంతర్జాతీయ ఒలింపిక్ అసోసియేషన్ కూడా ఖెలిఫ్ మహిళనే అంటూ పేర్కొని ఒలింపిక్స్‌కు అనుమతిచ్చింది. తాజా రిపోర్ట్‌లో పురుషుడని తేలడంతో స్వర్ణపతకం వెనక్కి తీసుకోవాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది.

Story first published: Tuesday, November 5, 2024, 14:55 [IST]
Other articles published on Nov 5, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+