For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Paralympics: భారత్ ఖాతాలో మరో రెండు పతకాలు.. మరియప్పన్‌ తంగవేలుకు సిల్వర్.. శరద్‌కు బ్రాంజ్!

Paralympics: Mariyapan Thangavelu Wins Silver; Bronze for Sharad Kumar
Tokyo Paralympics 2021 : India’s Medals పతకాల పంట Mariyappan, Sharad Kumar || Oneindia Telugu

టోక్యో: పారాలింపిక్స్‌లో భారత్‌ పతకాల వేట దిగ్విజయంగా కొనసాగుతోంది. బరిలోకి దిగిన ప్రతీ ఈవెంట్‌లో పతకాలను సాధిస్తూ.. మన పారా అథ్లెట్లు ఎదురులేకుండా దూసుకుపోతున్నారు. సోమవారం ఒక్కరోజే 5 పతకాలతో(రెండు స్వర్ణాలు, రెండు రజతాలు, ఓ కాంస్యం)తో మెరవగా.. మంగళవారం అదే జోరును కొనసాగించారు. ఉదయం భారత షూటర్ సింగ్‌రాజ్ అధాన కాంస్యపతకం అందించగా.. తాజాగా పురుషుల హైజంప్‌లో మరియప్పన్ తంగవేలు సిల్వర్ మెడల్‌తో మెరవగా.. శరద్ కుమార్ బ్రాంజ్ మెడల్ సాధించాడు. దాంతో భారత్ పతకాల సంఖ్య పదికి చేరింది.

మంగళవారం జరిగిన పురుషుల టీ42 హైజంప్ కేటగిరిలో మరియప్పన్ తంగవేలు 1.86 మీటర్ల ఎత్తు దూకి రెండో స్థానంలో నిలిచాడు. 1.88 మీటర్ల ఎత్తును క్లియర్ చేసిన అమెరికా అథ్లెట్ సామ్ గ్రూ స్వర్ణం పతకం చేజిక్కించుకోగా.. 1.83 మీటర్లతో శరద్ కుమార్ మూడో స్థానంలో నిలిచి కాంస్యపతకం అందుకున్నాడు.

2016 రియో పారాలింపిక్స్‌లో అతడు స్వర్ణంతో తొలిసారి అందరి దృష్టిని ఆకర్షించిన సంగతి తెలిసిందే. 1.88 మీటర్ల ఎత్తును క్లియర్ చేయడంలో తంగవేలు మూడు ప్రయత్నాల్లో తలపడగా.. గోల్డ్ మెడలిస్ట్ సామ్ మూడో ప్రయత్నంలో క్లియర్ చేశాడు. ఇక రియో ఒలింపిక్స్‌లో 6వ స్థానంలో నిలిచిన శరద్ కుమార్ ఈసారి మెరుగైన ప్రదర్శనతో కాంస్యం అందుకున్నాడు. ప్రారంభం నుంచే శరద్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. 1.73, 1.77, 1.80 మీటర్ల ఎత్తును తొలి ప్రయత్నాల్లోనే క్లియర్ చేశాడు. ఈ క్రమంలో కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్స్ కనబర్చాడు. రియో గోల్డ్ మెడలిస్ట్ తంగవేలు సైతం 1.80, 1.83, 1.86 మీట తొలి ప్రయత్నంలోనే అధిగమించాడు. కానీ 1.88 మీట్లను క్లియర్ చేయలేకపోయాడు. ఇదే ఈవెంట్‌లో పాల్గొన్న మరో భారత ప్లేయర్ వరుణ శింగ్ భాటీ 1.73 మీటర్లను అధిగమించలేక ఏడో స్థానంలో నిలిచాడు. కాగా, వీరిద్దరి ప్రదర్శనను మెచ్చుకుంటూ ప్రధాని నరేంద్ర మోదీ ట్విటర్‌లో అభినందించారు.

ఈ ఉదయం జరిగిన పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఎస్‌హెచ్‌ 1 విభాగంలో 216.8 పాయింట్లు సాధించి మూడో స్థానంలో నిలిచాడు. భారత్ తరఫున పాల్గొన్న మరో షూటర్‌ మనీశ్‌ అగర్వాల్ ఫైనల్స్‌లో ఏడో స్థానంతో సరిపెట్టుకొన్నారు. దీంతో పారాలింపిక్స్‌లో భారత్‌ సాధించిన పతకాల సంఖ్య ఎనిమిదికి పెరిగింది. ఈ పోటీల్లో చైనా క్రీడాకారుడు డిఫెడింగ్ ఛాంపియన్‌ చావో యాంగ్‌ (237.9 ) పారాలింపిక్ రికార్డు సృష్టించి స్వర్ణం సాధించగా, మరో చైనా క్రీడాకారుడు హువాంగ్ జింగ్‌ (237.5) రజతం అందుకున్నాడు. షూటింగ్‌లో కాంస్య పతకం సాధించిన సింగ్‌రాజ్‌ అధానాకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి, ట్విటర్‌ వేదికగా అభినందనలు తెలిపారు.

సోమవారం షూటింగ్‌లో అవని లేఖర స్వర్ణంతో చరిత్ర సృష్టించగా.. జావెలిన్ ఈవెంట్‌లో సుమిత్ అంటిల్ స్వర్ణం సాధించగా.. దేవేంద్ర ఝఝారియా సిల్వర్, సుందర్ సింగ్ గుర్జార్ బ్రాంజ్ మెడల్ సాధించారు. డిస్కస్ త్రోలో యోగేశ్ ఖతునియా సిల్వర్ సాధించాడు.

Story first published: Tuesday, August 31, 2021, 18:51 [IST]
Other articles published on Aug 31, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+