Paralympics 2024: భారత్‌కు మరో పతకం.. డిస్కస్ త్రోలో మెరిసిన యోగేష్!
పారిస్ పారాలింపిక్స్‌లో భారత పారా అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. సోమవారం భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. పురుషుల డిస్కస్ త్రో ఎఫ్56 కేటగిరిలో యోగేష్ కతునియా రజత పతకం సాధించాడు. యోగేష్ డిస్క్‌ను 42.22 మీటర్ల దూరం విసిరి రెండో స్థానంలో నిలిచాడు. తొలి ప్రయత్నంలోనే బెస్ట్ త్రో వేసిన యోగేష్.. భారత్‌కు 8వ పతకం అందించాడు.
ఆ తర్వాత 41.50 మీటర్లు, 41.55 మీటర్లు, 40.33 మీటర్లు, 40.89 మీటర్లు, 39.68 మీటర్లు దూరం విసిరాడు. బ్రెజిల్‌కు చెందిన క్లాడినే బాయిస్టా కొత్త ఒలింపిక్ రికార్డ్ 46.86 మీటర్లతో బంగారు పతకం సాధించగా.. గ్రీస్‌కు చెందిన కన్సాంటియన్స్ 41.32 మీటర్లు విసిరి కాంస్య పతకం అందుకున్నాడు.

యోగేష్ జీవితం స్ఫూర్తిదాయకం:
యోగేష్ కతునియా జీవితం అందరికి స్ఫూర్తిదాయకం. భారత ఆర్మీ జవాన్ అయిన జ్ఞాన్‌చంద్ కతునియా, మీనా దేవిలకు జన్మించిన యోగేష్ జీవితం అనూహ్యంగా మలుపు తిరిగింది. 9 ఏళ్ల వయసులో అరుదైన వ్యాధితో అతనికి పక్షవాతం వచ్చింది. అతనికి అండగా నిలిచి తల్లి ఫిజియోథెరపీ చేయించింది. 12 ఏళ్ల వయసులో పక్షవాతం నుంచి కోలుకున్న యోగేష్ నడవడం ప్రారంభించాడు.
చంఢీఘర్‌లోని ఇండియన్ ఆర్మీ పబ్లిక్ స్కూల్‌లో చదువుకున్న యోగేష్.. ఢిల్లీలో కామర్స్ డిగ్రీ పూర్తి చేశాడు. డిగ్రీ చదివే సమయంలో సచిన్ యాదవ్ అనే సహచరుడు యోగేష్‌కు పారా క్రీడలను పరిచయం చేశాడు. అతను చూపించిన వీడియోలతో స్పూర్తి పొందిన యోగేష్.. పారా అథ్లెటిక్స్‌ను కెరీర్‌గా ఎంచుకున్నాడు.
బెర్లిన్ వేదికగా జరిగిన 2018 వరల్డ్ పారా అథ్లెటిక్స్ యూరోపియన్ ఛాంపియన్‌షిప్‌లో డిస్కస్‌ను 45.18 మీటర్లు విసిరి వరల్డ్ రికార్డ్ నమోదు చేసింది. టోక్యో పారాలింపిక్స్‌లో 44.38 మీటర్లతో సిల్వర్ మెడల్ సాధించాడు. ఈ ఘనతను గుర్తించిన భారత ప్రభుత్వం 2021లో అతన్ని అత్యున్నత క్రీడా పురస్కారం అర్జున్ అవార్డుతో సత్కరించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications