Paralympics 2024: అట్టహాసంగా ఆరంభ వేడుకలు!
పారిస్ పారాలింపిక్స్ 2024 ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆకట్టుకునే కళా ప్రదర్శనలు, అబ్బురపరిచే కళాకారుల విన్యాసాలతో పారాలింపిక్స్‌కు తెరలేచింది. బుధవారం జరిగిన ఆరంభ వేడుకలు ప్రేక్షకులను అలరించాయి. పారిస్ ఒలింపిక్స్ తరహాలోనే పారాలింపిక్స్ ఆరంభ వేడుకలు కూడా స్టేడియంలో కాకుండా బయటే జరిగింది.
ఒలింపిక్స్ ప్రారంభోత్సవాన్ని సెన్ నదిలో నిర్వహించిన విషయం తెలిసిందే. పారాలింపిక్స్ ఆరంభ వేడుకల్లో భాగంగా అథ్లెట్ల పరేడ్‌ను ఛాంప్స్ ఎలీసీస్ నుంచి ప్లేస్ డి లా కాంకార్డ్ వరకూ నిర్వహించారు.

ఫ్రెంచ్ అక్షరమాల ప్రకారం మొదట అఫ్గానిస్థాన్ టీమ్ పరేట్‌లో పాల్గొనగా.. తర్వాత సౌతాఫ్రికా జట్టు వచ్చింది. భారత పతకదారులుగా టోక్యో పారాలింపిక్స్ స్వర్ణ పతక విజేత సుమిత్ ఆంటిల్(జావెలిన్ త్రో), ఆసియా పారా క్రీడల్లో రజత పతకం సాధించిన భాగ్యశ్రీ జాదవ్(షాట్‌పుట్) వ్యవహరించారు.
ఆరంభ వేడుకల్లో దివ్యాంగ కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ ఆరంభోత్సవ వేడుకులను చూసేందుకు ప్రేక్షకులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఈ వేడుకల్లో అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు థామస్ బాక్‌తో పాటు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మేక్రాన్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. 11 రోజుల పాటు జరిగే పారిస్ పారాలింపిక్స్‌లో 22 క్రీడల్లో 4 వేల మందికి పైగా పారా అథ్లెట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
తమ వైకల్యాలను వెనక్కినెట్టి పతకాల కోసం పోరాడనున్నారు. సెప్టెంబర్ 8న ముంగింపు వేడుకలు జరగనున్నాయి. ఈ క్రీడల్లో భారత్ నుంచి మొత్తం 84 మంది అథ్లెట్లు బరిలోకి దిగుతున్నారు. గురువారం తైక్వాండో, టేబుల్ టెన్నిస్, ట్రాక్ సైక్లింగ్‌లో పతకాంశాలు జరగబోతున్నాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications