For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అరేయ్​ ఏంట్రా... ఇది! జేమ్స్ బాండ్ సినిమా హీరోలా సిల్వర్ గెలిచేశాడు!

పారిస్ ఒలింపిక్స్‌లో టర్కీ షూటర్ యుసుఫ్ డికెక్ మెడల్ సాధించిన తీరు అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. జేమ్స్ బాండ్ సినిమా హీరోలా తుపాకీని పేల్చి సిల్వర్ కొట్టేశాడు. ప్రస్తుతం అతని షూటింగ్‌ చేసిన విధానం తీవ్ర చర్చనీయాంశమైంది.

10 మీటర్ల మిక్స్‌డ్ ఎయిర్ పిస్టల్ ఈ వెంట్‌లో యుసుఫ్ డికెక్-సెవ్వల్ ఇలాదా తర్హాన్ జోడీ రజతం సాధించింది. ఇదే విభాగంలో భారత షూటింగ్ ద్వయం మను భాకర్-సరబ్‌జోత్ బ్రాంజ్ మెడల్ గెలిచిన విషయం తెలిసిందే.

No-frills gear and Olympic silver Turkish shooter 51 is internet sensation

అయితే సాధారణంగా షూటింగ్ ఈవెంట్లలో షూటర్స్ చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. మెరుగైన గురి కోసం సన్‌గ్లాసెస్, బయట నుంచి వచ్చే శబ్దాల నుంచి రక్షణ కోసం ఇయర్ ప్రొటక్టర్లను వాడుతుంటారు. కానీ, 51 ఏళ్ల యూసఫ్ ఇవేవి లేకుండా వచ్చి పతకం గెలిచేశాడు.

ఓ టీషర్ట్ వేసుకొని కాజువల్‌గా ఈ పోటీలో నిలిచాడు. 51 ఏళ్లు కావడంతో సాల్ట్ అండ్ పెప్పర్ జుత్తు.. బక్కపలుచని దేహం.. ఎప్పుడు పెట్టుకునే కళ్ల జోడుతో గన్ చేతిలో పట్టుకొని.. ఓ చేయి ప్యాంట్ జేబులో పెట్టుకొని ఓ ఫొటోకు ఫోజిచ్చినట్లు నిలబడి గురి చూసి కాల్చేశాడు. అంతే దెబ్బకు ఒలింపిక్ సిల్వర్ మెడల్ ఎగిరొచ్చి అతని మెడలో పడింది.

అతను మెడల్ సాధించినదానికంటే.. తన అప్పియరెన్స్, పిస్టల్ కాల్చిన తీరు అందర్నీ ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం అతని షూటింగ్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియా వేదికగా వైరల్‌ కాగా.. నెటిజన్లు ఫన్నీ మీమ్స్‌తో వైరల్ చేస్తున్నారు.

'ఏంట్రా ఇది.. జేమ్స్ బాండ్ హీరోలా సిల్వర్ ఎగరేసుకుపోయాడు', 'ఆడు మగడ్రా బుజ్జీ'అంటూ కామెంట్స్ చేస్తున్నారు. భారత్‌లో ఇతనిలా షూట్ చేసేవారు గల్లీకి ఒకడు ఉంటారని, కానీ వారంత గ్యాంగ్‌స్టర్లుగా చలమాణి అవుతున్నారని సెటైర్లు పేల్చుతున్నారు. తొలిసారి 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో పోటీపడిన యూసఫ్‌ డెకెక్‌కు ఇది ఐదో ఎడిషన్. కానీ ఇదే అతని మొదటి ఒలింపిక్ మెడల్ కావడం విశేషం.

Story first published: Thursday, August 1, 2024, 21:48 [IST]
Other articles published on Aug 1, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+