న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Nisha Dahiya: మహిళా రెజ్లర్ దారుణ హత్య! వార్త నిజం కాదు!

Nisha Dahiyas murder news turns out to be fake

సోనెపట్(హర్యానా): జాతీయ స్థాయి మహిళా రెజ్లర్ నిషా దహియా దారుణ హత్యకు గురైందని వచ్చిన వార్తలు నిజం కాదని స్పష్టమైంది. తాను బతికే ఉన్నానని నిషా దహియా ఓ వీడియోను విడుదల చేసింది. హర్యానా, సోనెపట్‌లోని సుశీల్ కుమార్ అకాడమీలో గుర్తు తెలియని దుండగులు బుధవారం నిషా దహియాపై కాల్పులు జరిపారని, ఈ ఘటనలో నిషా దహియాతో పాటు ఆమె సోదరుడు అక్కడికక్కడే మృతి చెందారని ఇండియా టుడే తమ వెబ్‌సైట్‌లో ఓ కథనాన్ని ప్రచురించింది. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ నిషా దహియా తల్లిని సమీప ఆసుపత్రికి తరలించగా.. ఆమె పరిస్థితి విషమంగా ఉందని కూడా పేర్కొంది.

ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు నిషా దహియా, ఆమె సోదరుడు సూరజ్ మృతదేహాలను పోస్ట్ మార్టమ్‌కు తరలించి దర్యాప్తు చేపట్టారని, దుండగులను పట్టుకోవడానికి ప్రత్యేక బలగాలతో గాలింపు చేపట్టారని రాసుకొచ్చింది. అయితే ఈ వార్తలపై స్పందించిన రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా.. నిషా దహియా మాట్లాడిన వీడియోను మీడియాతో పంచుకుంది.

ఈ మీడియో నిషా దహియా మాట్లాడుతూ.. తాను మరణించినట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని, ప్రస్తుతం తాను సీనియర్ నేషనల్స్ పోటీల్లో భాగంగా గోండాలో ఉన్నట్లే పేర్కొంది.

ఇక నిషా గత శక్రవారమే ప్రపంచ చాంపియన్‌షిప్‌ అండర్ -23 కేటగిరిలో కాంస్య పతకం సాధించింది. ఆమె విజయాన్ని ప్రధాని నరేంద్రమోదీ అభినందించారు.

Story first published: Wednesday, November 10, 2021, 20:28 [IST]
Other articles published on Nov 10, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X