Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Exclusive: ఆ ఒక్కటి గెలిస్తే నా బిడ్డదే బంగారు పతకం: నిఖత్ జరీన్ తండ్రి

పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత బాక్సర్, తెలంగాణ ముద్దు బిడ్డ నిఖత్ జరీన్ గోల్డ్ మెడల్ సాధిస్తుందని ఆమె తండ్రి జమీల్ అహ్మద్ అన్నారు. నిఖత్ బంగారు పతకానికి ఒకే ఒక్క మ్యాచ్ అడ్డుగా ఉందని అభిప్రాయపడ్డారు. పారిస్ ఒలింపిక్స్ 2024‌లో భారీ అంచనాలతో బరిలోకి దిగిన వరల్డ్ ఛాంపియన్ నిఖత్ జరీన్.. తన క్యాంపైన్‌ను ఘనంగా ప్రారంభించింది.

తొలి మ్యాచ్‌లో ఈ హైదరాబాదీ బాక్సర్ 5-0తో జర్మనీకి చెందిన మ్యాక్సీ కరీనాను మట్టికరిపించింది. గురువారం జరిగే రెండో రౌండ్‌లో నిఖత్ జరీన్.. చైనాకు చెందిన టాప్ సీడ్ బాక్సర్, వరల్డ్ ఛాంపియన్ వు యు‌తో తలపడనుంది. వు యుకి బై పడటంతో ఆమె నేరుగా రెండో రౌండ్‌లో బరిలోకి దిగుతోంది. ఈ మ్యాచ్‌‌లో నిఖత్ జరీన్ గెలిస్తే ఆమెకు తిరుగుండదని జమీల్ అహ్మద్ జోస్యం చెప్పారు.

Exclusive Nikhat Zareen Father Jameel Ahmed says There is one match between Nikhat and the Gold Medal

నిఖత్ జరీన్ కీలక పోరు నేపథ్యంలో OneIndia, Mykhel ప్రతినిథులతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. తన కూతురు విజయంపై ఆశాభావం వ్యక్తం చేశారు. 'నిఖత్ జరీన్ గోల్డ్ మెడల్‌ సాధించేందుకు ఒకే ఒక్క పతకం దూరంలో ఉంది. ఇప్పటి వరకు వు యుతో నిఖత్ తలపడలేదు. ఇన్నాళ్లు 52 కేజీల కేటగిరిలో తలపడటంతో వు యుతో ఆడాల్సిన అవసరం నిఖత్‌కు రాలేదు.

టెక్నికల్‌గా నిఖత్ చాలా బలంగా ఉంది. వు యు టాప్ సీడ్ బాక్సర్ కావచ్చు. కానీ నిఖత్ జరీన్ వరల్డ్ ఛాంపియన్. ఇప్పటికే ఈ మ్యాచ్ గురించి నేను నిఖత్ జరీన్‌తో మాట్లాడాను. మేం చైనా బాక్సర్ బలహీనతలను గుర్తించాం. అందుకు తగ్గట్లు నిఖత్ సన్నదమైంది. తొలి మ్యాచ్‌లో విజయం సాధించి నిఖత్ సూపర్ ఫామ్ అందుకుంది. చైనా బాక్సర్‌ను నిఖత్ 5-0తో ఓడిస్తోంది.

ముందుగా చెప్పినట్లుగానే నిఖత్ గోల్ మెడల్ సాధించేందుకు ఒకే ఒక్క మ్యాచ్ అడ్డుగా ఉంది. నిఖత్ డ్రా చూస్తేనే ఈ విషయం అర్థమవుతోంది. నిఖత్ క్వార్టర్స్, సెమీస్, ఫైనల్స్‌ చేరితో ఎవరితో తలపడుతుందో అనేదానిపై మాకు ఐడియా ఉంది. నిఖత్ చాలా టోర్నీల్లో వారిని ఓడించింది. నా కూతురు ఇన్నాళ్లు పడ్డ కష్టానికి ప్రతి ఫలం దక్కుతుందని నేను భావిస్తున్నా. దేశం కోసం నిఖత్ జరీన్ ఖచ్చితంగా బంగారు పతకం గెలుస్తోంది. ఇప్పటి వరకు ఆమె సాధించిన ఘనతల పట్ల మేం ఎంతో గర్వపడుతున్నాం. అదే జోరును కొనసాగిస్తుందని ఆశిస్తున్నాం.

నిఖతర్ జరీన్ విజయం కోసం కోచ్‌లు, సపోర్ట్ స్టాఫ్, సైకాలజిస్ట్‌లు, కౌన్సిలర్స్ ఎంతో కష్టపడుతున్నారు. నిఖత్‌కు ఎంతో సాయం చేస్తున్నారు. వారందరి శ్రమతోనే నిఖత్ ఈ స్థాయికి వచ్చింది. నా బిడ్డ విజయం వెనుక ఉన్న ప్రతీ కోచ్‌కు నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు.'అని నిఖత్ జరీన్ తండ్రి చెప్పుకొచ్చాడు.

Story first published: Tuesday, July 30, 2024, 20:21 [IST]
Other articles published on Jul 30, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+