పారిస్ ఒలింపిక్స్ 2024 ముగింపు వేడుకల సందర్భంగా భారత జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా, మహిళా షూటర్ మనూ భాకర్ మాట్లాడుకున్న వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోలో మనుభాకర్, నీరజ్ చోప్రా చాలా సన్నిహితంగా ఉండటంతో నెటిజన్లు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా తామిద్దరని ఫోటో తీస్తున్న తన తల్లి సుమేధను మను భాకర్ వద్దని చెప్పడం చర్చనీయాంశమైంది.
తర్వాత నీరజ్ చోప్రాతో ప్రత్యేకంగా మాట్లాడిన సుమేధ.. అతనితో తలపై ఒట్టు వేయించుకున్నారు. అయితే ఈ ఇద్దరినీ ఫోటో తీస్తుంటే మనుభాకర్ ఎందుకు వద్దన్నారు..? నీరజ్ చోప్రాతో సుమేధ ఏం మాట్లాడారు? ఎందుకు ఒట్టు వేయించుకున్నారు? అనే వివరాలు తెలియాల్సి ఉంది. ఈ వీడియో చూస్తుంటే.. మనుభాకర్, నీరజ్ చోప్రాకు ఇంతకుముందే పరిచయం ఉన్నట్లు అర్థమవుతోంది.

ఈ ఇద్దరు మంచి స్నేహితులా? లేక రిలేషన్‌లో ఉన్నారా? అనే ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాల్సి ఉంది. నెటిజన్లు మాత్రం మనుభాకర్, నీరజ్ చోప్రా పెళ్లి ఎప్పుడు..? అంటూ ప్రశ్నిస్తున్నారు. మను భాకర్ తల్లి సుమేధ.. నీరజ్ చోప్రాతో మాట్లాడిన మాటలు కూడా ఈ సందేహాలకు బలం చేకూర్చుతున్నాయి. తన కూతురిని పెళ్లి చేసుకోవాలని నీరజ్ చోప్రాను సమేధ కోరినట్లు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

పారిస్ ఒలింపిక్స్ 2024లో నీరజ్ చోప్రా రజత పతకం గెలవగా.. పాకిస్థాన్ బళ్లెం వీరుడు అర్షద్ నదీమ్ బంగారు పతకం సాధించిన విషయం తెలిసిందే. ఈటెను 92.97 మీటర్ల దూరం విసిరిన నదీమ్.. ఒలింపిక్స్‌లో సరికొత్త రికార్డ్ నమోదు చేశాడు.

మరోవైపు నీరజ్ చోప్రా టోక్యో ఒలింపిక్స్ 2020 కంటే మెరుగైన ప్రదర్శన చేసినా అర్షద్ నదీమ్‌ను ధాటలేకపోయాడు. ఈటెను 89.45 మీటర్లు మాత్రమే విసిరి రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఈ సారి గోల్డ్ మెడల్ సాధించనందుకు తనను క్షమించాలని భారత ప్రజలను నీరజ్ చోప్రా కోరాడు.
మరోవైపు మనుభాకర్ రెండు కాంస్య పతకాలతో సత్తా చాటింది. మహిళల 10 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో మూడో స్థానంలో నిలిచి ఈ ఒలింపిక్స్‌లో తొలి పతకాన్ని అందించిన మనుభాకర్.. మిక్స్‌డ్ 10 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో సరబ్‌జ్యోత్ సింగ్‌తో కలిసి మరో కాంస్య పతకాన్ని అందుకుంది. తద్వారా ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన తొలి భారత అథ్లెట్‌గా సత్తా చాటింది. మరో పతకాన్ని మను భాకర్ తృటిలో కోల్పోయింది. మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో మను భాకర్ నాలుగో స్థానంలో నిలిచింది.