Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఫైనల్‌కు నీరజ్ చోప్రా.. గోల్డ్ మెడల్‌కు అడ్డుగా పాక్ ఆటగాడు!

వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో భారత బళ్లెం వీరుడు, గోల్డెన్ బాయ్ నీరజ్‌ చోప్రా ఫైనల్‌ చేరాడు. బుధవారం టోక్యో నేషనల్ స్టేడియం వేదికగా జరిగిన క్వాలిఫికేషన్ రౌండ్‌లో గ్రూప్-ఏలో బరిలోకి దిగిన నీరజ్ చోప్రా తొలి ప్రయత్నంలోనే ఈటెను 84.85 మీటర్ల దూరం విసిరి ఫైనల్‌కు అర్హత సాధించాడు. తొలి ప్రయత్నంలోనే క్వాలిఫై కావడంతో నీరజ్ చోప్రా మరోసారి ఈటెను విసరలేదు. అయితే ఈటె 84.85 మీటర్ల దూరంలోనే పడటంతో నీరజ్ చోప్రా అసహనానికి గురయ్యాడు.

మరో భారత జావెలిన్ త్రోయర్ సచిన్ యాదవ్ కూడా ఫైనల్‌కు అర్హత సాధించాడు. అతను మూడు ప్రయత్నాల్లో ఈటెను వరుసగా 80.16 మీటర్లు, 83.67 మీటర్లు, 82.63 మీటర్లు విసరాడు. 83.67 మీటర్లు బెస్ట్‌తో ఫైనల్‌కు అర్హత సాధించాడు. భారత్ నుంచి పోటీ పడిన రోహిత్ యాదవ్, విజయ్ సింగ్‌లు ఫైనల్ చేరలేకపోయారు. ఈ ఇద్దరూ క్వాలిఫికేషన్ మార్క్‌ను అందుకోలేకపోయారు.

Neeraj Chopra Secures Spot in World Athletics Championships Final with First Throw

గట్టెక్కిన పాక్ బళ్లెం వీరుడు..

మరోవైపు పాకిస్థాన్ జావెలిన్ త్రోయర్, పారిస్ ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ అర్షద్ నదీమ్.. అతి కష్టం మీద ఫైనల్‌కు అర్హత సాధించాడు. తొలి రెండు ప్రయత్నాల్లో అర్షద్ నదీమ్ ఈటెను 74.17 మీటర్లు, 76.99 మీటర్లు మాత్రమే విసిరాడు. ఆఖరి ప్రయత్నంలో 85.28 మీటర్ల దూరం విసిరి గట్టెక్కాడు. ఓవరాల్‌గా గ్రేనేడియన్ జావెలిన్ త్రోయర్ అండర్సన్ పీటర్స్ సీజన్ బెస్ట్ 89.53 మీటర్లు రికార్డ్‌తో అగ్రస్థానంలో నిలవగా.. జులైన్ వెబెర్(జర్మనీ)-87.21 మీటర్లు, జులియన్ ఎగో(కెన్యా)-85.96 మీటర్లు, డేవిడ్ వేగ్నర్(పోలాండ్) 85.67 వీటర్లు, అర్షద్ నదీమ్(పాక్)-85.28 మీటర్లు.. నీరజ్ చోప్రా కంటే ముందు నిలిచారు. ఫైనల్లో ఈ ఐదుగురు కంటే అత్యుత్తమ ప్రదర్శన కనబరిస్తేనే నీరజ్ చోప్రాకు స్వర్ణం దక్కుతుంది.

నీరజ్ స్వర్ణం గెలిస్తే చరిత్రే..

ఈ టోర్నీలో నీరజ్ చోప్రా బంగారు పతకం సాధిస్తే.. అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో వరుసగా రెండు స్వర్ణాలు గెలిచిన మూడో జావెలిన్ త్రోయర్‌గా నిలిస్తాడు. గతంలో చెక్ లెజెండ్ జాన్ జీలెంజీ(1993, 1995), జర్మనీ ప్లేయర్ జోహన్నెస్ వెట్టెర్(2019, 2022) ఈ ఫీట్ సాధించారు. ప్రస్తుతం జాన్ జీలెంజీ నీరజ్ చోప్రాకు కోచ్‌గా వ్యవహరిస్తుండటం విశేషం.

యూజిన్ వేదికగా జరిగిన 2022 అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో సిల్వర్ గెలిచిన నీరజ్ చోప్రా.. 2023లో బుడపెస్ట్‌లో స్వర్ణం సాధించి సరికొత్త చరిత్రను సృష్టించాడు.


ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్ 2025( జావెలిన్ త్రో)- ఫైనల్‌కు అర్హత సాధించిన వారి జాబితా

అండర్సన్ పీటర్స్ (GRN) - 89.53 మీటర్లు (ఈ సీజన్ బెస్ట్)

జూలియన్ వెబర్ (GER) - 87.21 మీటర్లు

జూలియస్ యెగో (KEN) - 85.96 మీటర్లు (ఈ సీజన్ బెస్ట్)

దావిద్ వెగ్నర్ (POL) - 85.67 మీటర్లు (పర్సనల్ బెస్ట్)

అర్షద్ నదీమ్ (PAK) - 85.28 మీటర్లు

నీరజ్ చోప్రా (IND) - 84.85 మీటర్లు

కర్టిస్ థాంప్సన్ (USA) - 84.72 మీటర్లు

జకుబ్ వాద్లెచ్ (CZE) - 84.11 మీటర్లు (ఈ సీజన్ బెస్ట్)

కేశోర్న్ వాల్కాట్ (TTO) - 83.93 మీటర్లు

సచిన్ యాదవ్ (IND) - 83.67 మీటర్లు

కామెరాన్ మెక్‌ఎంటైర్ (AUS) - 83.03 మీటర్లు (పర్సనల్ బెస్ట్)

రమేష్ తరంగ పతిరాజ్ (SRI) - 82.80 మీటర్లు

Story first published: Wednesday, September 17, 2025, 17:15 [IST]
Other articles published on Sep 17, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+