Neeraj Chopra: ఇంతకంటే ఏం ఆశిస్తాం.. అందుకే మిల్కా సింగ్‌కు అంకితమిచ్చా.. బయోపిక్‌కు టైముంది!

న్యూఢిల్లీ: ఒలింపిక్ గోల్డ్‌తో తన కల సాకారమైనా పోరాటం ఆపబోనని, ఇకపై కూడా ఆటపైనే ఫోకస్ పెడతానని భారత నయా హీరో నీరజ్ చోప్రా స్పష్టం చేశాడు. భారత ఫస్ట్ ట్రాక్ అండ్ ఫీల్డ్ మెడలిస్ట్ అనే ఫీలింగ్ గర్వంగా ఉందని తెలిపాడు. టోక్యోలో అదరగొట్టి భారత్‌కు వచ్చిన నీరజ్ టైమ్స్ నౌకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన జర్నీ గురించి చెప్పుకొచ్చాడు.'ఒలింపిక్స్ ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో భారత్‌కు తొలి మెడల్, అది కూడా గోల్డ్ అందించినందుకు సంతోషంగా ఉన్నా.
ఈ మెడల్ భారత క్రీడల్లో కొత్త విప్లవానికి నాంది పలికింది. ఈ సంతోషాన్ని వర్ణించేందుకు నాకు మాటలు రావడం లేదు. స్టేడియంలో మన జెండా ఎగిరినప్పుడు, జాతీయ గీతం వినిపించినప్పుడు మాత్రం నేను చాలా గర్వపడ్డా. ఇండియన్ అథ్లెటిక్స్‌కు మున్ముందు ఇంకా మంచి రోజులు ఉన్నాయని భావిస్తున్నా.
2019లో గాయం కారణంగా, 2020లో కరోనా వల్ల నేను చాలా సమయంలో కోల్పోయా. అప్పుడు ఎదురైన చేదు జ్ఞాపకాన్నింటినీ ఈ గోల్డ్ మెడల్ చెరిపేసింది. అలాగే నాకెంతో సంతృప్తి కలిగించింది. ఎందుకంటే ప్రతీ అథ్లెట్ తన లైఫ్ టైమ్‌లో ఒక్కసారైనా ఒలింపిక్ మెడల్ నెగ్గాలని కలగంటాడు. నేనిప్పుడు ఏకంగా గోల్డ్ మెడల్ సాధించా. ఇంతకంటే ఇంకా నేను ఏం ఆశిస్తాను.

ఆ క్షణమే గోల్డ్ ఖాయమనుకున్నా..
ఫైనల్ జరుగుతున్నప్పుడు ప్రతీ త్రోకు బెస్ట్ ఇవ్వాలనుకున్నా. అదే టైమ్‌లో నా త్రోలతో నా బాడీ మూవ్‌మెంట్ సహకరించేలా చూసుకున్నా. జావెలిన్ త్రో అనేది ఎక్కువగా టెక్నికల్ గేమ్. ఇందులో మనం చాలా సహనంగా మన మెదడుకు ఎక్కువ పనిపెట్టాలి. టెక్నిక్‌లో ఏ తప్పిదం ఉన్నా అటెంప్ట్ మొత్తం వృథా అవుతుంది. నా ఆటపై ముందు నుంచే చాలా విశ్వాసంగా ఉన్నా. మిగతా పోటీదారులు వాళ్ల చివరి ప్రయత్నాల్లో బెస్ట్ ఇవ్వకపోయినప్పుడు నేను గోల్డ్ నెగ్గానని తెలుసుకున్నా.

అందుకే మిల్కాకు అంకితం..
మిల్కా అథ్లెటిక్స్ కెరీర్‌కు సంబంధించి చాలా వీడియోలను చూశా. భారత ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెటిక్స్ ఒలింపిక్ పోడియంపై నిల్చోవాలని ఆయన కోరుకున్నారు. 1960 రోమ్ ఒలింపిక్స్‌లో ఆయన కొద్దిలో మెడల్ మిస్సయ్యారు. కాబట్టి మరే ఇండియన్ అథ్లెట్ అయినా ఒలింపిక్స్‌కు వెళ్లి పతకం నెగ్గాలని ఆశించారు.
నేను గోల్డ్ నెగ్గిన తర్వాత జాతీయ గీతం వినిపిస్తున్నప్పుడు మిల్కా చెప్పిన మాటలన్నీ నా మైండ్‌లోకి వచ్చాయి. అప్పుడు నా ఎమోషన్స్‌ను కంట్రోల్ చేసుకోలేక పోయా. పోడియంపై నిల్చుకున్నప్పుడు కూడా ఆయన గురించి, ఆయన చిరకాల కోరిక గురించే ఆలోచించా. అందుకే మెడల్‌ను ఆయనకు అంకితం చేశా.

ప్రశాంతంగా నిద్రపోతా..
ఈ మెడల్‌తో ఇన్నేళ్లుగా నేను పడ్డ కష్టానికి, చేసిన త్యాగాలకు ప్రతిఫలం దక్కిందని అనిపించింది. ఆ ఫీలింగ్‌ను మాటల్లో చెప్పలేను. ఆ క్షణాన్ని ఆస్వాదించానంతే. మీరు కూడా చూశారు. ప్రస్తుతానికైతే ఈ విజయాన్ని ఆస్వాదిస్తా. ఇంటికెళ్లగానే అమ్మ చేసే చూర్మ తింటా. నాకిప్పుడు బ్రేక్ అవసరం. చాలా అలసిపోయాను. ప్రశాంతంగా నిద్రపోతా. ఆ తర్వాత నా ట్రైనింగ్ స్టార్ట్ చేసి వచ్చే ఏడాది జరిగే కామన్వెల్త్ గేమ్స్, ఏషియన్ గేమ్స్, వరల్డ్ చాంపియన్‌షిప్స్‌పై ఫోకస్ పెడతా.

బయోపిక్‌కు టైముంది..
ఒలింపిక్ గోల్డ్ తర్వాత సోషల్ మీడియాలో ఫాలోవర్లు అమాంత పెరగడం చూశా. ప్రజలు నన్ను గుర్తించినందుకు, నాలో ఓ స్టార్‌ను చూస్తున్నందుకు సంతోషమే. ఇక, నా లైఫ్ ఆధారంగా సినియా(బయోపిక్) వస్తే. అందులో నేనే నటించాలని కోరుకుంటున్నారని విన్నా. ప్రస్తుతానికి నా ఫోకస్ మొత్తం ఆటపైనే. తర్వాతే బయోపిక్. దానికేం తొందర లేదు. నేను రిటైర్డైన తర్వాత నాపై బయోపిక్ తీయొచ్చు. ఈ ఆటలో నేను మరింత సాధించాలని, దేశానికి మంచి పేరు తేవాలని కోరుకుంటున్నా. ఓ అథ్లెట్‌గా నాకు మరింత గౌరవం సంపాదించాలని ఆశిస్తున్నా.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications