For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Neeraj Chopra: భారత ఒలింపిక్స్ బృందానికి ఘన స్వాగతం.. సంతోషంగా ఉందన్న గోల్డెన్ హీరో!

Neeraj Chopra says he was very happy to be back home after his Tokyo 2020 heroics
Tokyo Olympics 2020 : Neeraj Chopra Returns India, Gets Grand Welcome At Airport || Oneindia Telugu

ఢిల్లీ: కష్టకాలంలో ఐక్యతను చాటుతూ.. భవిష్యత్‌పై భరోసాను కల్పిస్తూ.. క్రీడా ప్రపంచాన్ని ఉర్రూతలుగించిన 32వ విశ్వ క్రీడా సంబురం టోక్యో ఒలింపిక్స్ విజయవంతంగా ముగిసాయి. ఆదివారం అట్టహాసంగా జరిగిన ముగింపు వేడుకల్లో 2024లో జరిగే 33వ ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇస్తున్న పారిస్‌కు ఒలింపిక్ జెండాను అప్పగించడంతో 17 రోజుల మెగా గేమ్స్ పూర్తయ్యాయి. దాంతో సుమారు 80 మంది అథ్లెట్లతో కూడిన భారత్ ఒలింపిక్స్ బృందం సోమవారం స్వదేశం చేరింది. విశ్వవేదికపై భారత జెండాను రెపరెపలాండించిన ఒలింపిక్స్‌ కీడ్రాకారులకు ఘన స్వాగతం లభించింది. ఇండియన్ ఒలింపిక్స్ అసోసియేషన్, కేంద్ర ప్రభుత్వ అధికారులతో పాటు భారీ అభిమానగణంతో ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం కిక్కిరిసిపోయింది. అక్కడ మొత్తం పండుగ వాతావరణం నెలకొంది.

ఈ మధ్యాహ్నమే భారత బృందం స్వదేశం చేరగా వారిని విమానాశ్రయ సమీపంలో అశోక హోటల్‌కు తరలించారు. మరికాసేపట్లో భారత అథ్లెట్లను సన్మానించనున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు, ప్రభుత్వ ప్రతినిధులు పాల్గొననున్నారు. 100 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ జావెలిన్ త్రో స్వర్ణం సాధించిన నీరజ్ చోప్రాకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. విమానాశ్రయం మొత్తం నీరజ్ పేరుతో మార్మోగిపోయింది. ఇక స్వదేశం చేరిన అనంతరం నీరజ్ చోప్రా ఇండియా టుడేతో మాట్లాడారు. ఈ తరహా ఘనస్వాగతాన్ని తాను ముందే ఊహించనాని, స్వదేశం చేరడం సంతోషంగా ఉందన్నాడు.

ఇక తమ బంగారు కొండకు స్వాగతం పలికేందుకు నీరజ్ కుటుంబ సభ్యులు సోమవారమే పానిపట్ నుంచి ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్నారు. బంగారు మెడల్ సాధించిన తమ కొడుకు, భారత నయా హీరోకు స్వాగతం పలికారు. ఫోన్‌లో తన తల్లిదండ్రులతో ఎక్కవ మాట్లాడలేదని, ఇంటికి వచ్చిన తర్వాతే వారి పక్కన కూర్చొని మెడల్ గెలిచిన అనుభూతిని, పంచుకోవాలనుకున్నానని తెలిపాడు. పోడియంపై వెళ్లగానే తనకు కలిగిన ఫీలింగ్, మువ్వన్నెల జెండా ఎగరడం, జాతీయ గీతం రావడం వంటి సంతోషకరమైన క్షణాలను వారి స్వయంగా పంచుకోవానుకున్నానని చెప్పాడు.

'ఇప్పటికీ మా తల్లిదండ్రులతో ఏం మాట్లాడలేదు. నాకు వారితో ఇలా గబగబా మాట్లాడని లేదు. వారితో హాయిగా కూర్చొని నిదానంగా మాట్లాడాలనుకున్నా. ఇలా ఎవరితోనూ నేను మాట్లాడాను. అందరితోనూ సాధ్యమైనంత వరకు మాట్లాడుతా.'అని నీరజ్ చెప్పుకొచ్చాడు. ఇక ఈ ఒలింపిక్స్‌లో మీరాబాయి చాను రజతంతో మొదలైన భారత్ ప్రస్థానం నీరజ్ చోప్రా స్వర్ణ మెడల్‌తో ఘనంగా ముగిసింది. బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు, బాక్సర్ లవ్లీనా, భారత పురుషుల హాకీ టీమ్, కుస్తీ వీరుడు బజరంగ్ పునియా కాంస్య పతకాలు అందుకోగా.. రవి దహియా స్వర్ణం సాధించాడు. దాంతో మెడల్ టేబుల్స్‌లో భారత్ 48వ స్థానంలో నిలిచింది. మరోసారి అగ్రరాజ్యం అమెరికానే అగ్రస్థానాన్ని అందుకుంది.

Story first published: Monday, August 9, 2021, 19:39 [IST]
Other articles published on Aug 9, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+