Asian Games 2026: భారత్‌కు బిగ్ షాక్.. నీరజ్ చోప్రా దూరం!
ఆసియా గేమ్స్ 2026 ప్రారంభానికి ముందే భారత బృందానికి బిగ్ షాక్ తగిలింది. జావెలిన్ స్టార్, గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా గాయంతో ఆసియా గేమ్స్‌కు దూరమయ్యాడు. ప్రాక్టీస్‌లో అతని చీలమండ లిగమెంట్‌కు గాయమైంది. ఈ విషయాన్ని నీరజ్ చోప్రానే శనివారం సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు.
'ఎంతో కష్టపడిన తర్వాత లుసానె డైమండ్ లీగ్‌లో ఈ సీజన్‌లోనే బెస్ట్ త్రో(88.05 మీటర్లు) వేసినట్లు అనిపించింది. కానీ అంతలోనే దురదృష్టవశాత్తు ట్రైనింగ్‌లో నా చీలమండకు గాయమైంది. లిగమెంట్ చిట్లిపోయింది. వైద్యుడితో పాటు నా టీమ్‌తో చర్చించిన తర్వాత ఈ సీజన్‌లో మిగిలిన మ్యాచ్‌లకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను.

ఇది నిరాశ కలిగించే విషయం. నా ఆటలో రిథమ్ అందుకునే దశకు చేరుకున్నానని భావిస్తున్న తరుణంలో ఇలా జరగడం బాధగా ఉంది. ఇప్పుడు నా దృష్టి రివకరీ, మరింత ఫిట్‌గా మారడంపైనే ఉంది.'అని నీరజ్ చోప్రా పేర్కొన్నాడు.
ఈ గాయం కారణంగా ఆసియా గేమ్స్‌తో పాటు సెప్టెంబర్ 5న బ్రసెల్స్‌లో జరగనున్న డైమండ్ లీగ్ ఫైనల్‌కు కూడా నీరజ్ చోప్రా దూరం కానున్నాడు. సెప్టెంబర్ 11 నుంచి 13 వరకు జరిగే వరల్డ్ అథ్లెటిక్స్ అల్టిమేట్ ఛాంపియన్‌షిప్స్‌లో కూడా పాల్గొనడం లేదు. ఆసియా గేమ్స్ 19 నుంచి జపాన్‌లో ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే.
నీరజ్ చోప్రా గైర్హాజరీతో ఆసియా గేమ్స్‌లో భారత్‌కు ఒక పతకం దూరమైనట్లే. అథ్లెటిక్స్ విభాగంలో నీరజ్ చోప్రా కచ్చితంగా ఓ పతకం సాధించేవాడు. ఇటీవల గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్‌లో నీరజ్ చోప్రా(85.83 మీటర్లు) సిల్వర్ మెడల్ సాధించిన సంగతి తెలిసిందే. భారత్‌కే చెందిన యశ్వీర్ సింగ్ (85.41 మీటర్లు) కాంస్య పతకం సాధించాడు. నీరజ్ చోప్రా గైర్హాజరీలో యశ్వీర్ సింగ్‌పైనే భారత్ పతక ఆశలు పెట్టుకుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

