For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చరిత్ర సృష్టించిన నీరజ్ చోప్రా.. తొలి నాన్ క్రికెటర్‌గా..!

భారత స్టార్ జావెలియన్ త్రోయర్, గోల్డెన్ భాయ్ నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించాడు. అత్యధిక బ్రాండ్ వాల్యూ కలిగిన తొలి భారత నాన్ క్రికెటర్‌‌గా నిలిచాడు. టోక్యో ఒలింపిక్స్ 2020లో బంగారు పతకం సాధించి అందరి దృష్టిని ఆకర్షించిన నీరజ్ చోప్రా.. ఇటీవల ముగిసిన పారిస్ ఒలింపిక్స్‌ 2024లో రజత పతకం సాధించాడు. దాంతో నీరజ్ చోప్రా బ్రాండ్ వాల్యూ అమాంతం పెరిగింది.

భారత్‌లో క్రికెటర్ల తర్వాత అత్యంత ఆదరణ కలిగిన క్రీడాకారుడిగా కూడా నీరజ్ చోప్రా తెలిపాడు. ఓ బిజినెస్ వెబ్‌సైట్ లెక్కల ప్రకారం నీరజ్ చోప్రా బ్రాండ్ వాల్యూ 330 కోట్లు. పారిస్ ఒలింపిక్స్ తర్వాత నీరజ్ చోప్రా బ్రాండ్ వాల్యూ రూ.87 కోట్లు పెరగడం విశేషం.

Neeraj Chopra is also the highest valued non-cricketer among Indian sportspersons

ఈ క్రమంలో అతను టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను అధిగమించాడు. పారిస్ ఒలింపిక్స్‌లో రెండు కాంస్య పతకాలు సాధించిన మను భాకర్.. బ్రాండ్ వాల్యూ కూడా బాగానే పెరిగింది. ఇప్పటికే ఆమెను 40 సంస్థలు తమ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకునేందుకు అప్రోచ్ అయినట్లు తెలుస్తోంది. ఒలింపిక్స్ ముందు ఒక ఎండార్స్ మెంట్‌కు ఏడాదికి రూ. 25 లక్షలు తీసుకునే మను భాకర్.. ప్రస్తుతం రూ. 1.5 కోట్లు తీసుకున్నట్లు సమాచారం.

ప్రస్తుతం భారత్‌లో అత్యధిక బ్రాండ్ వాల్యూ కలిగిన క్రీడాకారుడిగా టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కొనసాగుతున్నాడు. ప్రస్తుతం అతని బ్రాండ్ వాల్యూ 227.9 మిలియన్ డాలర్లుగా ఉంది. కోహ్లీ తర్వాత మహేంద్ర సింగ్ ధోనీ 95.8 మిలియన్ డాలర్లు, సచిన్ టెండూల్కర్ 91.3 మిలియన్ డాలర్లు, రోహిత్ శర్మ రూ. 41 మిలియన్ డాలర్లు తర్వాతి స్థానంలో ఉన్నారు.

డైమండ్‌లీగ్ మెరిసిన నీరజ్ చోప్రా..

లుసానె డైమండ్ లీగ్‌ 2024లో నీరజ్ చోప్రా సత్తా చాటాడు. ఈటెను 89.49 మీటర్లు విసిరి రెండో స్థానంలో నిలిచాడు. ఈ సీజన్‌లో నీరజ్ చోప్రాకు ఇదే అత్యుత్తమ ప్రదర్శన. అయితే ఈ టోర్నీలోనూ అతని 90 మీటర్ల కల నెరవేరలేదు.

గ్రెనెడా జావెలిన్ త్రోయర్ అండర్సన్ పీటర్స్ 90.61 మీటర్లతో అగ్రస్థానంలో నిలిచి స్వర్ణం సాధించాడు. జర్మన్ ప్లేయర్ వెబర్ జులియన్ 87.08 మీటర్లతో మూడో స్థానాన్ని పొందాడు. పారిస్ ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్, పాకిస్థాన్ జావెలిన్ త్రోయర్ అర్షద్ నదీమ్ ఈ టోర్నీకి దూరంగా ఉన్నాడు. గాయం కారణంగానే అతను బరిలోకి దిగలేదని తెలుస్తోంది.

Story first published: Friday, August 23, 2024, 11:51 [IST]
Other articles published on Aug 23, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+