న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జాతీయ క్రీడా అవార్డులు ఆలస్యం.. కరోనా దెబ్బతో వేడుకలు వాయిదా?

National sports awards likely to be delayed this year

న్యూఢిల్లీ: కరోనా కారణంగా జాతీయ క్రీడా అవార్డుల వేడుకలు ఈ ఏడాది షెడ్యూల్‌ ప్రకారం జరిగేలా కనిపించడం లేదు. వైరస్‌ వ్యాప్తి దృష్ట్యా సామూహిక వేడుకలపై నిషేధం ఉండటంతో ఈ కార్యక్రమాన్ని నెల లేదా రెండు నెలలు వాయిదా వేసే అవకాశముంది. భారత హాకీ దిగ్గజం మేజర్‌ ధ్యాన్‌చంద్‌ జయంతిని పురస్కరించుకొని ప్రతీ ఏడాది ఆగస్టు 29న జాతీ య క్రీడా అవార్డులను ప్రభుత్వం అందజేస్తోంది.

ఇప్పటివరకు అర్హుల జాబితా కూడా మంత్రిత్వ శాఖ సిద్ధం చేయలేదు. కనీసం సెలక్షన్‌ కమిటీని కూడా నియమించకపోవడం విశేషం. క్రీడా దినోత్సవం నాడు ఇచ్చే రాజీవ్‌ గాంధీ ఖేల్‌ రత్న, అర్జున, ద్రోణాచార్య, ధ్యాన్‌చంద్‌ అవార్డులకు ఈ ఏడాది 500కు పైగా దరఖాస్తులు వచ్చాయి.

మరో వైపు హరియాణాకు చెందిన వుషూ ప్లేయర్‌ 'శిక్షా'కు కేంద్ర క్రీడా మంత్రి కిరణ్‌ రిజిజు రూ. 5 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా 22 ఏళ్ల శిక్షా వ్యవసాయ కూలీగా మారడంతో పండిత్‌ దీన్‌ దయాళ్‌ ఉపాధ్యాయ్‌ జాతీయ సంక్షేమ నిధి నుంచి ఆమెకు రూ. 5 లక్షలు మంజూరు చేశారు.

చెలరేగిన విల్లే.. ఐసీసీ సూపర్‌ లీగ్‌‌లో ఇంగ్లండ్ బోణీ!చెలరేగిన విల్లే.. ఐసీసీ సూపర్‌ లీగ్‌‌లో ఇంగ్లండ్ బోణీ!

Story first published: Friday, July 31, 2020, 10:00 [IST]
Other articles published on Jul 31, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X