న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రాష్ట్రపతి భవన్‌లో ఘనంగా క్రీడా పురస్కారాల ప్రదానోత్సవం.. అర్జున అవార్డు అందుకున్న తెలంగాణ ముద్దు బిడ్డ!

National Sports Awards 2022: Nikhat Zareen conferred with Arjuna award

న్యూఢిల్లీ: రాష్ట్రపతి భవన్‌లో జాతీయ క్రీడా పురస్కారాల ప్రదానోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. బుధవారం జరిగిన ఈ కార్యక్రమంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వివిధ క్రీడల్లో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులకు పురస్కారాలు అందజేశారు. క్రీడల్లో అత్యున్నత పురస్కారమైన ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న అవార్డును టేబుల్ టెన్నిస్ లెజెండ్ అచంట శరత్ కమాల్ అందుకోగా.. అర్జున అవార్డును 25 మంది క్రీడాకారులు స్వీకరించారు. భారత స్టార్ బాక్సర్, తెలంగాణ ముద్దు బిడ్డ నిఖత్ జరీన్ అర్జున అవార్డు అందుకుంది.

ఆమెతో పాటు తెలంగాణ నుంచి టేబుల్ టెన్నిస్ ప్లేయర్ ఆకుల శ్రీజ కూడా ఈ పురస్కారాన్ని అందుకుంది. భారత క్రీడా మంత్రిత్వ శాఖ నవంబర్ 14న ఈ ఏడాదికి సంబంధించిన క్రీడా పురస్కారల వివరాలను ప్రకటించింది. రోహిత్ శర్మ చిన్ననాటి కోచ్ దినేష్ లాడ్‌కు లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు అందుకున్నాడు. ఈ ఏడాది క్రికెట్ నుంచి దినేష్ లాడ్ ఒక్కరే క్రీడా పురస్కారం అందుకున్నారు.

విజేతల జాబితా:

మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు: ఆచంట శరత్ కమల్

అర్జున అవార్డులు: సీమా పూనియా (అథ్లెటిక్స్), ఆల్డస్ పాల్ (అథ్లెటిక్స్), అవినాష్ సాబుల్ (అథ్లెటిక్స్), లక్ష్య సేన్ (బ్యాడ్మింటన్), హెచ్ఎస్ ప్రణయ్ (బ్యాడ్మింటన్), అమిత్ (బాక్సింగ్), నిఖత్ జరీన్ (బాక్సింగ్), భక్తి కులకర్ణి (చెస్) , ఆర్ ప్రజ్ఞానంద (చెస్), దీప్ గ్రేస్ ఇక్కా (హాకీ), ​​సుశీలా దేవి (జూడో), సాక్షి కుమారి (కబడ్డీ), నయన్ మోని సైకియా (లోన్‌బాల్), సాగర్ ఓవల్కర్ (మల్కాంబ్), ఎలవెనిల్ వలరివన్ (షూటింగ్), ఓంప్రకాష్ మిథర్వాల్ (షూటింగ్) శ్రీజ ఆకుల (టేబుల్ టెన్నిస్), వికాస్ ఠాకూర్ (వెయిట్ లిఫ్టింగ్), అన్షు (రెజ్లింగ్), సరిత (రెజ్లింగ్), పర్వీన్ (వుషు), మాన్సీ జోషి (పారా బ్యాడ్మింటన్), తరుణ్ ధిల్లాన్ (పారా బ్యాడ్మింటన్), స్వప్నిల్ పాటిల్ (పారా స్విమ్మింగ్), జెర్లిన్ అనికా జె (చెవిటి బ్యాడ్మింటన్)

ద్రోణాచార్య అవార్డు (రెగ్యులర్ విభాగంలో కోచ్‌లకు): జీవన్‌జోత్ సింగ్ తేజ (ఆర్చరీ), మహ్మద్ అలీ కమర్ (బాక్సింగ్), సుమా షిరూర్ (పారా-షూటింగ్) మరియు సుజిత్ మాన్ (రెజ్లింగ్)

జీవితకాల పురస్కారం: దినేష్ లాడ్ (క్రికెట్), బిమల్ ఘోష్ (ఫుట్‌బాల్), రాజ్ సింగ్ (రెజ్లింగ్)

ధ్యాన్ చంద్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు: అశ్విని అక్కుంజీ (అథ్లెటిక్స్), ధరమ్‌వీర్ సింగ్ (హాకీ), ​​బిసి సురేష్ (కబడ్డీ), నీర్ బహదూర్ గురుంగ్ (పారా అథ్లెటిక్స్)

నేషనల్ స్పోర్ట్స్ ప్రమోషన్ అవార్డు: ట్రాన్స్ స్టేడియా ఎంటర్‌ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్, కళింగ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, లడఖ్ స్కీ అండ్ స్నోబోర్డ్ అసోసియేషన్.

Story first published: Wednesday, November 30, 2022, 17:26 [IST]
Other articles published on Nov 30, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X