Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Jyothi Yerraji: రీఎంట్రీలో సత్తా చాటిన తెలుగు తేజం!

భారత హర్డిల్స్ క్వీన్, నేషనల్ రికార్డ్ హోల్డర్ జ్యోతి యర్రాజీ దుమ్మురేపింది. గాయం కారణంగా దాదాపు ఏడాది పాటు ఆటకు దూరమైన ఈ 26 ఏళ్ల తెలుగు తేజం.. రీఎంట్రీ తొలి రేసులోనే సత్తా చాటింది. ఈ అద్వితీయమైన ప్రదర్శనతో ఆసియా గేమ్స్‌కు అర్హత సాధించింది.

భువనేశ్వర్‌లోని కళింగ స్టేడియంలో బుధవారం మొదలైన 'నేషనల్ ఇంటర్-స్టేట్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్' తొలి రోజే జ్యోతి ఈ ఘనత సాధించింది. మహిళల 100 మీటర్ల హర్డిల్స్ హీట్స్‌ రేసులో పాల్గొన్న ఈ విశాఖ అమ్మాయి.. కేవలం 13.14 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుంది. అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (AFI) నిర్ణయించిన ఆసియా క్రీడల క్వాలిఫైయింగ్ ప్రమాణం (13.34 సెకన్లు) కంటే ఇది ఎంతో మెరుగైనది కావడం విశేషం.

National Record Holder Jyothi Yarraji Clinches Asian Games Spot in Stunning Injury Comeback

గాయాన్ని జయించి..

గతేడాది జూన్‌లో శిక్షణ పొందుతున్న సమయంలో జ్యోతి తీవ్రంగా గాయపడింది. జూలైలో ఆమెకు మోకాలి లిగమెంట్ శస్త్రచికిత్స జరిగింది. దాదాపు 12 నెలల సుదీర్ఘ విరామం తర్వాత బరిలోకి దిగిన జ్యోతి.. రెండు కాళ్లకు మెడికల్ టేపులు కట్టుకునే ఈ రేసులో పరిగెత్తింది. ఈ రేసు ఆమె పట్టుదలకు నిదర్శనంగా నిలిచింది.

జ్యోతి యర్రాజీ పేరిట 12.78 సెకన్ల నేషనల్ రికార్డు ఉంది. 2023లో ఆమె ఈ రికార్డ్ సాధించింది. అంతకుముందు చైనాలో జరిగిన 2022 ఆసియా క్రీడల్లో ఆమె రజత పతకం సాధించింది. గాయం నుంచి కోలుకొని బరిలోకి దిగిన తొలి రేసులోనే ఆసియా గేమ్స్ బెర్త్‌ను ఖరారు చేసుకోవడంతో.. రాబోయే ప్రధాన టోర్నీల్లో జ్యోతి మళ్లీ పతకాల వేట కొనసాగించడం ఖాయంగా కనిపిస్తోంది.

IND vs IRE: వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం! జియో హాట్‌స్టార్‌లో రాదు.. ఎలా చూడాలంటే?

IND vs IRE: వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం! జియో హాట్‌స్టార్‌లో రాదు.. ఎలా చూడాలంటే?

భారత హర్డిల్ క్వీన్..

భారత అథ్లెటిక్స్ చరిత్రలో 'హర్డిల్స్ క్వీన్'గా పేరుగాంచిన జ్యోతి యర్రాజీ.. అతి తక్కువ కాలంలోనే అంతర్జాతీయ వేదికలపై త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించింది. 100 మీటర్ల హర్డిల్స్‌లో 13 సెకన్ల కంటే తక్కువ సమయంలో రేసును పూర్తి చేసిన మొదటి భారతీయ మహిళా అథ్లెట్‌గా ఆమె చరిత్ర సృష్టించింది.

వైభవ్ సూర్యవంశీ.. 16 ఏళ్ల సచిన్‌లా ఉన్నాడు: కపిల్ దేవ్

వైభవ్ సూర్యవంశీ.. 16 ఏళ్ల సచిన్‌లా ఉన్నాడు: కపిల్ దేవ్

2023 ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ జ్యోతి అద్భుత ప్రదర్శన చేసింది. 100 మీటర్ల హర్డిల్స్‌లో స్వర్ణ పతకం గెలవడంతో 200 మీటర్ల పరుగులో కూడా రజత పతకం సాధించింది. క్రీడల్లో ఆమె కనబరిచిన అసాధారణ ప్రతిభకు గుర్తింపుగా 2023లో కేంద్ర ప్రభుత్వం అర్జున అవార్డుతో సత్కరించింది.

Story first published: Wednesday, June 24, 2026, 18:39 [IST]
Other articles published on Jun 24, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+