పిట్ట కొంచెం కూత ఘనం.. 14 ఏళ్ల వయసులోనే 3 స్వర్ణాలు!
నేషనల్ గేమ్స్ 2025లో భారత స్విమ్మర్ దినిధి దేసింగు సత్తా చాటింది. మూడు స్వర్ణాలు గెలిచి ఔరా అనిపించింది. గతేడాది పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించిన ఈ 14 ఏళ్ల కర్ణాటక స్విమ్మర్.. తాజాగా జాతీయ క్రీడల్లో దుమ్ము రేపింది. బుధవారం జరిగిన మహిళల 200 మీటర్ల ఫ్రీస్టైల్‌లో దినిధి(2 నిమిషాల 3.24 సెక్లను)తో సరికొత్త రికార్డ్‌ను నమోదు చేసింది.
ఈ క్రమంలో మూడేళ్ల క్రితం హషిక నెలకొల్పిన 2 నిమిషాల 7.08 సెకన్ల రికార్డ్‌ను బ్రేక్ చేసింది. ఢిల్లీకి చెందిన భవ్య(2 నిమిషాల 8.68 సెకన్లు), మహారాష్ట్ర స్విమ్మర్ అదితి(2 నిమిషాల 9.74 సెకన్లు) సిల్వర్, బ్రాంజ్ మెడల్ సాధించారు.

100 మీటర్ల బటర్‌ఫ్లైలోనూ దినిధి(1నిమిషం 3.62 సెకన్లు) స్వర్ణం సాధించింది. కర్ణాటకకే చెందిన నైషా(1 నిమిషం 4.81 సెకన్లు), ఒడిషా స్విమ్మర్ శ్రిష్టి( 1 నిమిషం 5.20 సెకన్లు)తో రజత, కాంస్య పతకం గెలుచుకున్నారు. 4X100 మీటర్ల ఫ్రీ స్టయిల్ రిలే జట్టు స్వర్ణం నెగ్గడంలోనూ దినిధి కీలకపాత్ర పోషించింది. దాంతో దినిధి ఖాతాలో మూడు స్వర్ణాలు చేరాయి.
ఈ టీమ్ ఈవెంట్‌లో కర్ణాటక 4 నిమిషాల 1.58 సెకన్ల సమయంలోనే రేసు పూర్తి చేసి అగ్రస్థానంలో నిలిచింది. మహారాష్ట్ర(4 నిమిషాల 2.17 సెకన్లు), తమిళనాడు(4 నిమిషాల 8.81 సెకన్లు) రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. 14 ఏళ్ల వయసులోనే మూడు స్వర్ణాలు గెలిచిన దినిధి దేసింగుపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. 'పిట్ట కొంచెం కూత ఘనం'అని కొనియాడుతున్నారు.
మరో ఒలింపిక్ స్విమ్మర్ శ్రీహరి నటరాజ్.. రెండు గోల్డ్ మెడల్స్ గెలిచాడు. పురుషుల 200 మీటర్ల ఫ్రీస్టైల్, 4X100 మీటర్ల ఫ్రీ స్టైల్ రిలే రేసులో అతను విజేతగా నిలిచాడు. 4X100 ఫ్రీస్టైల్ రిలేలో కర్ణాటక పురుషుల టీమ్ 3 నిమిషాల 26.26 సెకన్లతో ఆల్‌టైమ్ రికార్డ్ నమోదు చేసింది. స్విమ్మర్ల అసాధారణ ప్రదర్శనతో తొలి రోజు పోటీలు ముగిసే సరికి కర్ణాటక 5 స్వర్ణాలు, 2 రజతాలతో అగ్రస్థానంలో నిలిచాయి. తెలుగు రాష్ట్రాలు ఇంకా ఖాతా తెరవలేదు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications