Mirabai Chanu:'బంపర్ ఆఫర్' అంటే ఇదే.. మీరాబాయి చానుకి గోల్డ్ మెడల్ వచ్చే చాన్స్! అదెలాగంటే?

టోక్యో: ప్రతిష్ఠాత్మక టోక్యో ఒలింపిక్స్ 2021 వెయిట్‌లిఫ్టింగ్ పోటీల్లో భారత స్టార్ అథ్లెట్ మీరాబాయి చాను మెడల్ సాధించిన విషయం తెలిసిందే. శనివారం జరిగిన మహిళల 49 కిలోల విభాగంలో సిల్వర్ పతాకాన్ని కైవసం చేసుకుంది. స్నాచ్‌లో 87 కిలోలు, క్లీన్ అండ్ జర్క్‌లో 115 కిలోలు.. మొత్తంగా 202 కిలోలు మెడల్ దక్కించుకుంది. చైనా వెయిట్ లిఫ్టర్ జిహూయి హూ మొత్తంగా 210 కిలోలు ఎత్తి స్వర్ణం అందుకుంది. అంతేకాదు ఒలింపిక్స్‌లో రికార్డు బరువు ఎత్తి చరిత్ర సృష్టించింది. ఇక ఇండోనేషియాకు చెందిన విండి కాంటికా ఐసా మొత్తం 194 కిలోల బరువుతో కాంస్యం సాధించింది.

జిహూయి హూపై డోపింగ్ ఆరోపణలు
అయితే భారత వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చానుకు ఇప్పుడు గోల్డ్ మెడల్ దక్కే సువర్ణావకాశం ముందుంది. మహిళల 49 కిలోల విభాగంలో గోల్డ్ గెలిచిన చైనా అథ్లెట్ జిహూయి హూ డోపింగ్‌కు పాల్పడినట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఈ మేరకు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. హేమాన్ క్యాపిటల్ మేనేజ్‌మెంట్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్, యుఎస్ పౌరుడు కైల్ బాస్ తన ట్విటర్ ఖాతాలో ఓ పోస్ట్ చేయడం.. ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. 'చైనా వెయిట్ లిఫ్టర్ జిహూయి హూను డోపింగ్ నిరోధక అధికారులు పరీక్షిస్తారు' అని ట్వీట్ చేశాడు.

డోపింగ్ పరీక్షలో విఫలమైతే
కైల్ బాస్ ట్వీట్ చేయడంతో ఆ వార్త నిజమే అని సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి. జిహూయి హూను ఒలింపిక్స్ ఆంటీ డోపింగ్ అధికారులు త్వరలోనే పరీక్షించనున్నారట. అందుకోసం ఆమెను టోక్యోలోనే ఉండమని ఆదేశించారని సమాచారం. ఇప్పటికే మీరాబాయి చాను స్వదేశానికి చేరుకుంది. ఒకవేళ జిహూయి హూ డోపింగ్ పరీక్షలో విఫలమైతే.. మిరాబాయి చానుకు స్వర్ణ పతకం దక్కనుంది. ఇదే జరిగితే.. భారత్ ఖాతాలో గోల్డ్ మెడల్ చేరనుంది. అలానే ఇండోనేషియా అథ్లెట్ విండి కాంటికాను సిల్వర్ మెడల్ వరించనుంది. మరి ఈ వార్తల్లో ఎంత నిజముందో చూడాలి.
శిఖర్ ధావన్‌కు షాక్.. రోహిత్ శర్మతో ఓపెనింగ్ చేసేది కేఎల్ రాహులే! కారణం ఇదే!!
కలిసొచ్చిన కరోనా
కరోనా మహమ్మారిని అందరూ తిట్టుకునేవాళ్లే.. కానీ మీరాకు మాత్రం కలిసొచ్చింది. గత ఏడాది ఒలింపిక్స్ షెడ్యూల్ ప్రకారం జరిగి ఉంటే ఆమె పతకం గెలిచేది కాదేమో. ఎందుకంటే అప్పటికి ఆమె ఫిట్‌నెస్ అత్యుత్తమ స్థాయిలో లేదు. 2019 ఆమె వెన్ను, భుజం గాయాలతో ఇబ్బంది పడింది. ఆ ప్రభావం తర్వాతి ఏడాదీ కొనసాగింది.
కొన్ని నెలల పాటు బరువులెత్తలేదు. కరోనా కారణంగా ఒలింపిక్స్‌తో పాటు పోటీలన్నీ రద్దవడంతో నెమ్మదిగా గాయాల నుంచి కోలుకుంది. కరోనా వల్ల మీరాకు జరిగిన మరో మేలు.. ఉత్తర కొరియా ఒలింపిక్స్ నుంచి తప్పుకోవడం. గట్టి పోటీదారైన ఆ దేశ లిఫ్టర్ దూరం కావడంతో చానుకు పతక రేసులో ఓ అడ్డంకి తొలగిపోయింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications