
కప్ కొట్టాలని
2007లో ఛాంపియగ్‌గా నిలిచిన భారత్ కూడా ఈసారి కప్ కొట్టాలని చూస్తోంది. అందుకోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రణాళికలు రచిస్తోంది. ప్రస్తుతం శ్రీలంకతో టీమిండియా మూడు మ్యాచుల టీ20 సిరీస్ ఆడుతోంది. ఇందులో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో సత్తాచాటిన ప్లేయర్స్ ఉన్నారు. అందులో కొందరు టీ20 ప్రపంచకప్‌లో ఆడే అవకాశాలు కూడా ఉన్నాయి. అందుకే లంక సిరీసును మెగా టోర్నీ సన్నద్ధత కోసం ఉపయోగించుకుంటోంది. ఆపై ఐపీఎల్ 2021లోని మిగతా మ్యాచులను కూడా భారత ఆటగాళ్లు ఉపయోగించుకోనున్నారు.

స్ట్రైక్ రేట్ చూసుకుంటే
మెగా టోర్నీ కోసం భారత జట్టులో తీవ్ర పోటీ నెలకొంది. ఒక్కో స్థానం కోసం 2-3 పోటీపడుతున్నారు. ముఖ్యంగా ఓపెనింగ్ కోసం సీనియర్ల మద్యే పోటీ నెలకొంది. ఒక ఓపెనర్‌గా రోహిత్ శర్మ ఖాయం. మరో ఓపెనర్‌గా శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్ మధ్య పోటీ నెలకొంది. అయితే టీ20లు కాబట్టి వేగంగా ఆడాలి. తక్కువ బంతుల్లో వీలైనన్ని పరుగులు పిండుకోవాలి. ఇక్కడ స్ట్రైక్ రేట్ చాలా ముఖ్యం.
ఇటీవలి స్ట్రైక్ రేట్ చూసుకుంటే.. మాత్రం అవకాశం రాహుల్‌కే దక్కనుంది. రాహుల్-ధావన్ చేసిన గత 500 పరుగుల స్ట్రైక్ రేట్ చూసుకంటే.. టాప్‌లో రాహుల్ ఉన్నాడు. అతడి స్ట్రైక్ రేట్ 142.2గా ఉంది. అదే సమయంలో గబ్బర్ స్ట్రైక్ రేట్ 127.4గా ఉంది. ఇది రాహుల్‌కు కాస్త అనుకూలమనే చెప్పాలి. మరి కెప్టెన్ విరాట్ కోహ్లీ ఎవరికీ ఓటేస్తాడో చూడాలి.
Tokyo Olympics 2021: బ్యాడ్మింటన్‌లో నిరాశే.. సాత్విక్-చిరాగ్ జోడీ ఓటమి!!

ధావన్ ఓపెనింగ్ చేస్తే
మూడో స్థానంలో విరాట్ కోహ్లీ రానున్నాడు. ఒకవేళ రోహిత్ శర్మ-శిఖర్ ధావన్ ఓపెనింగ్ చేస్తే.. కేఎల్ రాహుల్ మిడిల్ ఆర్డర్‌లో కూడా వచ్చే అవకాశం ఉంది. సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ కూడా మిడిల్ ఆర్డర్ పోటీలో ఉన్నారు. వికెట్ కీపర్ స్థానంలో రిషబ్ పంత్ పక్కా. ఇక రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యా ఆల్‌రౌండర్ కోటాలో ఉంటారు. భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, దీపక్ చహర్, మొహ్మద్ షమీ, మొహ్మద్ సిరాజ్ పేస్ కోటాలో.. యుజ్వేంద్ర చహల్, కృనాల్ పాండ్యాలు స్పిన్ విభాగంలో పోటీలో ఉన్నారు. యువ ఆటగాళ్లు కూడా సీనియర్లకు గట్టి పోటీ ఇవ్వనున్నారు. తుది జట్టు విషయంలో కోహ్లీకి తలనొప్పి తప్పకపోవచ్చు.

యూఏఈ, ఒమన్ దేశాల్లో
టీ20 ప్రపంచకప్ 2021 మ్యాచ్‌లు నాలుగు వేదికల్లో జరగనున్నాయి. యూఏఈ, ఒమన్ దేశాలు మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇస్తున్నాయి. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం, ద షేక్ జాయెద్ స్టేడియం, షార్జా స్టేడియం, ఒమన్ క్రికెట్ అకాడమీ గ్రౌండ్‌లో మెగా టోర్నీ మ్యాచ్‌లను నిర్వహించనున్నారు. ప్రపంచకప్ తొలి రౌండ్‌లో అర్హత సాధించిన 8 జట్లు.. రెండు గ్రూపులుగా విడిపోయి మ్యాచ్‌లు ఆడుతాయి. ఈ జట్ల నుంచి నాలుగు టీమ్‌లు.. సూపర్12కు ఎంపికవుతాయి. ఆ జట్లు 8 ఆటోమెటిక్ క్వాలిఫైయర్స్‌తో కలుస్తాయి. ప్రిలిమనరీ స్టేజిల్లో పోటీపడే దేశాల్లో బంగ్లాదేశ్, శ్రీలంక, ఐర్లాండ్, నెదర్లాండ్స్, స్కాట్‌ల్యాండ్, నమీబియా, ఒమన్, పప్వా న్యూ గునియాలు ఉన్నాయి.


Click it and Unblock the Notifications












