Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నీరజ్ చోప్రాతో పెళ్లి.. మను భాకర్ ఏమన్నదంటే..?

పారిస్ ఒలింపిక్స్ 2024లో రెండు కాంస్య పతకాలతో సత్తా చాటిన భారత షూటర్ మను భాకర్‌కు యూత్‌లో మంచి క్రేజ్ ఏర్పడింది. పారిస్ ఒలింపిక్స్ ముందు వరకు పెద్దగా ఎవరికీ తెలియని ఈ 22 ఏళ్ల అమ్మాయి.. అసాధారణ ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రస్తుతం ఆమె ఏం మాట్లాడినా.. ఏం చేసినా సెన్సేషన్‌గా మారుతోంది.

ఈ క్రమంలోనే పారిస్ ఒలింపిక్స్ 2024 ముగిసిన అనంతరం భారత జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాతో ఆమె మాట్లాడిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఇద్దరూ సిగ్గు పడుతూ మాట్లాడుకోవడం.. ఒకరికొకరు చూసుకోకపోవడం సందేహాలకు దారి తీసింది. ఈ వీడియో కారణంగా ఇద్దరూ ప్రేమించుకుంటున్నారనే వాదన తెరపైకి వచ్చింది.

Manu Bhaker Reacts To Her Marriage Rumours With Neeraj Chopra

అంతేకాకుండా మను భాకర్ తల్లి.. నీరజ్ చోప్రాతో ఒట్టు వేయించుకోవడం కూడా ఈ వార్తలకు బలం చేకూర్చింది. ఈ ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని సోషల్ మీడియా వేదికగా జోరుగా ప్రచారం జరిగింది. తన కూతురిని పెళ్లి చేసుకోవాలని నీరజ్‌ను మను భాకర్ తల్లి కోరిందని నెటిజన్లు కామెంట్స్ చేశారు.
అయితే ఈ వార్తలపై ఇప్పటికే మను భాకర్ తండ్రి స్పందించారు.

మను భాకర్ చాలా చిన్న పిల్లని, ఆమెకు పెళ్లి చేసే వయసు రాలేదన్నారు. నీరజ్ చోప్రా తమ కొడుకులాంటి వాడని, వారి మధ్య ఎలాంటి రిలేషన్ లేదని వివరణ ఇచ్చారు. తాజాగా ఈ పెళ్లి పుకార్లపై మను భాకర్ కూడా స్పందించింది. సహచర అథ్లెట్‌గా ఎదురుపడినప్పుడు నీరజ్ చోప్రాతో మాట్లాడుతుంటానని, అంతకు మించి తమ మధ్య ఎలాంటి బంధం లేదని స్పష్టం చేసింది.

'నేను కూడా ఈ రూమర్స్ విన్నాను. ఈ పుకార్లపై స్పష్టత ఇవ్వాలనుకుంటున్నాను. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదు. నీరజ్‌తో మాట్లాడుతుండగా.. ఎవరో తెలియకుండా వీడియో తీసారు. మా మధ్య అంతగా ఇంటరాక్షన్ కూడా ఏం లేదు. వివిధ పోటీలు, టోర్నీల్లో ఎదురుపడినప్పుడు సరదాగా పలకరించుకుంటాం.

అంతేకానీ మా మధ్య ఎలాంటి రిలేషన్‌షిప్ లేదు. మేం ప్రేమలో ఉన్నట్లు వస్తున్న వార్తలన్నీ అవాస్తవం. మా అమ్మ నీరజ్ చోప్రాతో మాట్లాడినప్పుడు నేను అక్కడ లేను. వారి మధ్య ఏలాంటి సంభాషణ జరిగిందో నాకు తెలియదు.'అని మను భాకర్ చెప్పుకొచ్చింది.

పారిస్ ఒలింపిక్స్ 2024లో నీరజ్ చోప్రా రజత పతకం గెలవగా.. మనుభాకర్ రెండు కాంస్య పతకాలు సాధించింది. మహిళల 10 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో మూడో స్థానంలో నిలిచి ఈ ఒలింపిక్స్‌లో తొలి పతకాన్ని అందించిన మనుభాకర్.. మిక్స్‌డ్ 10 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో సరబ్‌జ్యోత్ సింగ్‌తో కలిసి మరో కాంస్య పతకాన్ని అందుకుంది. తద్వారా ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన తొలి భారత అథ్లెట్‌గా చరిత్రకెక్కింది.

Story first published: Wednesday, August 14, 2024, 21:47 [IST]
Other articles published on Aug 14, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+