For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్వర్ణం సాధించా, టాప్‌లో చేర్చండి: క్రీడల మంత్రికి మన్‌జీత్ అభ్యర్ధన

By Nageshwara Rao
Manjit Singh wants TOP Scheme inclusion after Asiad gold

హైదరాబాద్: ఇండోనేషియా వేదికగా జరిగిన ఆసియా గేమ్స్‌లో పురుషుల 800 మీటర్ల పరుగు పందెంలో స్వర్ణం సాధించిన అథ్లెట్ మన్‌జీత్ సింగ్‌ తనను టార్గెట్‌ ఒలింపిక్‌ పోడియం (టాప్‌) పథకంలో చేర్చాలని కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖను కోరాడు.

ప్రస్తుతం తనకు ఎలాంటి ఉద్యోగం లేకపోవడంతో టాప్‌లో చేర్చి తన శిక్షణకు సాయంగా నిలవాలని క్రీడా మంత్రిత్వ శాఖకు రాసిన లేఖలో పేర్కొన్నాడు. 2020లో టోక్యో వేదికగా జరిగే ఒలింపిక్స్‌లో పతకాలు సాధించడమే లక్ష్యమే టాప్‌ పథకాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.

"ఓఎన్‌జీసీ నా కాంట్రాక్టును పునరిద్ధరించడానికి నిరాకరించడంతో 2016లో నా ఉద్యోగం పోయింది. నేను ఫలితాలు రాబట్టడం లేదనే ఉద్దేశంతో వాళ్లు ఉద్యోగం నుంచి తొలగించారు. అంతకుముందు నెలనెలా భత్యం ఇచ్చేవారు. ప్రస్తుతం ఆసియా క్రీడల్లో పసిడి నెగ్గడంతో కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ నాపై దృష్టి సారిస్తుందని అనుకుంటున్నా" అని అన్నాడు.

టాప్‌లో చోటు కల్పిస్తుందని ఆశిస్తున్నా

టాప్‌లో చోటు కల్పిస్తుందని ఆశిస్తున్నా

"పతకం సాధించే క్రమంలో నేను ఎదుర్కొన్న ఇబ్బందులు తెలుసుకోనైనా టాప్‌లో చోటు కల్పిస్తుందని ఆశిస్తున్నా. నాకు ఎలాంటి స్పాన్సర్‌ లేరు. అలాగే ఏ సంస్థ కూడా నాకు సాయం చేయడం లేదు. క్రీడా మంత్రిత్వ శాఖ టాప్‌లో చేర్చితే నా శిక్షణ కొనసాగించడం సులభం అవుతుంది" అని మన్‌జీత్ అన్నాడు. ఈ గేమ్స్‌లో స్వర్ణం సాధించడంతో 1982 ఏషియాడ్‌ (చార్ల్స్‌ బొరోమియో) తర్వాత 800 మీటర్ల విభాగంలో స్వర్ణం సాధించిన భారత తొలి అథ్లెట్‌గా మన్‌జీత్‌ అరుదైన ఘనత సాధించాడు.

మొండి పట్టుదలే స్వర్ణం తెచ్చేలా చేసింది: ఎవరీ మన్‌జీత్ సింగ్

ఆర్థిక సమస్యల్లో స్థైర్యం కోల్పోని మన్‌జీత్‌

ఆర్థిక సమస్యల్లో స్థైర్యం కోల్పోని మన్‌జీత్‌

నిజానికి రెండేళ్ల క్రితమే మన్‌జీత్‌ కెరీర్‌ దాదాపు ముగింపు దశకు వచ్చేసింది. ‘ఇప్పటి వరకు నువ్వు చెప్పుకోదగ్గ ప్రదర్శన ఇవ్వలేదు. ఇంకా మెరుగుపర్చుకునే వయసు కూడా నీది కాదు' అంటూ ఓఎన్‌జీసీ చిన్న కాంట్రాక్ట్‌ ఉద్యోగం నుంచి కూడా అతడిని తప్పించింది. దీంతో ఆర్థిక సమస్యలు పెరిగిపోయాయి. ఇలాంటి స్థితిలోనూ ఆ క్రీడాకారుడు స్థైర్యం కోల్పోలేదు. ఆసియా గేమ్స్‌కు ముందు మన్‌జీత్ ఒక్క అంతర్జాతీయ పోటీలోనూ పతకం గెలిచింది లేదు.

ఈ ఏడాది మార్చిలో ఉద్యోగం నుంచి తప్పించిన ఓఎన్‌జీసీ

ఈ ఏడాది మార్చిలో ఉద్యోగం నుంచి తప్పించిన ఓఎన్‌జీసీ

ఇక, జాతీయ స్థాయిలో ఆఖరి సారిగా 2013లో పతకం సాధించాడు. ఆ తర్వాత నుంచీ అతడి ప్రదర్శన పడిపోతూ వచ్చింది. దీంతో ఓఎన్‌జీసీ ఈ ఏడాది మార్చిలో అతడిని తప్పించింది. మన్‌జీత్ ప్రదర్శన ఏమంత గొప్పగా లేకపోవడంతో అతడి వల్ల సంస్థకు ఒనగూరుతున్న ప్రయోజనం ఏమీ లేదని తేల్చేసి, ఉపకార వేతనం ఆపేసింది. ఇలాంటి సమయంలో ఆర్మీ కోచ్‌ అమ్రిష్‌ కుమార్‌ మాత్రమే అండగా నిలిచారు.

నెలకు 30 వేల సొంత ఖర్చుతో ఆర్మీ క్యాంప్‌లో శిక్షణ

నెలకు 30 వేల సొంత ఖర్చుతో ఆర్మీ క్యాంప్‌లో శిక్షణ

అప్పటి వరకు ఫలితాలు బాగా లేకపోయినా మన్‌జీత్‌లో ప్రతిభ ఉందని గుర్తించిన అమ్రిష్‌ ‘నీ జీవితంలో ఎలాంటి బాధ్యతలు లేకుండా రెండేళ్లు నాకు ఇస్తే ఆసియా గేమ్స్‌లో పతకం సాధించేలా చేస్తాను' అని ప్రోత్సహించారు. అంతే... కోచ్‌కు మాట ఇచ్చి రెండేళ్లు అతను తీవ్రంగా కష్టపడ్డాడు. నెలకు 30 వేల సొంత ఖర్చుతో ఆర్మీ క్యాంప్‌లో శిక్షణ పొందాడు. అయినప్పటికీ, ఆసియా చాంపియన్‌షిప్, 2018 కామన్వెల్త్‌ క్రీడలకు కూడా అర్హత సాధించలేకపోయాడు.

 ఫైనల్ రేసులో అద్భుతం చేసిన మన్‌జీత్‌

ఫైనల్ రేసులో అద్భుతం చేసిన మన్‌జీత్‌

కానీ మన్‌జీత్‌ పట్టు వదల్లేదు. ఆసియా గేమ్స్ బెర్తు సాధించాడు. అంతర్‌ జిల్లా అథ్లెటిక్స్‌లో రెండో స్థానం సాధించాడు. జాతీయ రికార్డుతో స్వర్ణం సాధించిన జిన్సన్‌ మీదే ఆసియా గేమ్స్‌లో అందరూ అంచనాలు పెట్టుకున్నారు. సెమీఫైనల్లో ఎనిమిదో స్థానంలో నిలిచి అతి కష్టం మీద ఫైనల్‌కు అర్హత సాధించిన మన్‌జీత్ ఫైనల్ రేసులో అద్భుతమే చేశాడు.

Story first published: Wednesday, September 5, 2018, 8:48 [IST]
Other articles published on Sep 5, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+