
దీపిక- అతాను
ఒకే ఈవెంట్‌లో భార్యాభర్తలుగా ప్రతిష్టాత్మక సమ్మర్ గేమ్స్ బరిలోకి దిగుతున్న తొలి భారత జోడీ దీపిక, అతాను దాస్. గతేడాది వీరి వివాహం జరిగింది. రికర్వ్ ఆర్చరీ మహిళల వ్యక్తిగత విభాగంలో టాప్ ర్యాంకర్ అయిన దీపిక.. గోల్డ్ మెడలే లక్ష్యంగా మూడోసారి విశ్వక్రీడల బరిలో నిలుస్తోంది. ఇక అతాను దాస్ తొలిసారి ఒలింపిక్స్‌లో పాల్గొంటున్నాడు. మిక్స్‌డ్ విభాగంలో వీరిద్దరూ పతకం తీసుకొస్తారనే అంచనాలున్నాయి.

చార్లెట్ కాస్లిక్-లూయిస్ హాలెండ్
ఆస్ట్రేలియా రగ్బీ కపుల్ చార్లెట్, లూయిస్. ఆసీస్ మహిళలు, పురుషుల రగ్బీ జట్ల తరఫున వీరు బరిలోకి దిగుతున్నారు. గతేడాదే వీరి వివాహం జరగాల్సి ఉన్నా కరోనా కారణంగా వాయిదా పడింది. ఈ ఏడాది డిసెంబర్‌లో వీరి వివాహం జరగనుంది. చార్లెట్ రియో ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించాడు.

తారా డేవిస్ -హంటర్ వుడ్‌హాల్
అమెరికాకు చెందిన తారా డేవిస్-హంటర్ వుడ్‌హాల్ జంటగానే టోక్యోకు చేరుకున్నారు. మహిళల లాంగ్ జంప్‌లో డేవిస్ బెర్త్ ఖరారు చేసుకోగా.. పారాలింపిక్స్ ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో హంటర్ తలపడనున్నాడు.

శాండీ-టైరోన్
అమెరికా జంపింగ్ జోడీ శాండీ మోరిస్, టైరోన్ స్మిత్. శాండీ పోల్‌వాల్ట్ అథ్లెట్ కాగా.. స్మిత్ లాంగ్ జంప్‌లో అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. 2019 నుంచి వీరిద్దరూ పీకల్లోతూ ప్రేమలో మునిగి తేలుతున్నారు.

స్వర్ణాల జోడీ లారా-జాసన్
ఇంగ్లండ్‌కు చెందిన ప్రముఖ సైక్లింగ్ జోడీ లారా, జాసన్ కెన్నీ. 2016లో వివాహం చేసుకున్న ఈ జోడీ... విశ్వ క్రీడల్లో విజయవంతమైన జంటగా గుర్తింపు పొందింది. వీరి వద్ద 10 ఒలింపిక్ స్వర్ణాలుండడం విశేషం.

మేగన్- సుబర్డ్
అమెరికా మహిళా సాకర్ టీమ్ ప్లేయర్ మేగన్, యూఎస్ బాస్కెట్‌బాల్ క్రీడాకారిణి సు బర్డ్ గతేడాదే నిశ్చితార్థం చేసుకున్నారు. వీరిద్దరూ ఈసారి తమ క్రీడా విభాగాల్లో బరిలోకి దిగుతున్నారు.


Click it and Unblock the Notifications












