Exclusive: గ్లోబల్ పవర్‌హౌస్‌గా భారత్.. టీటీ దిగ్గజం శరత్ కమల్ జోస్యం
రాబోయే రోజుల్లో టేబుల్ టెన్నిస్‌లో భారత్ ఆధిపత్యం చెలాయిస్తుందని మాజీ టేబుల్ టెన్నిస్ ప్లేయర్ శరత్ కమల్ విశ్వాసం వ్యక్తం చేశాడు. తదుపరి తరం టేబుల్ టెన్నిస్ ఆటగాళ్లపై తనకు పూర్తి నమ్మకం ఉందని చెప్పాడు. భారత టేబుల్ టెన్నిస్ అభివృద్ధిలో శరత్ కమల్ అత్యంత కీలక పాత్ర పోషించారు. కామన్వెల్త్ గేమ్స్‌లో భారత జట్టుకు సారథ్యం వహించడమే కాకుండా.. పలు పతకాలను అందించాడు. కామన్వెల్త్ గేమ్స్‌లో ఏడు స్వర్ణాలు, మూడు రజతాలు, మూడు కాంస్య పతకాలు సాధించాడు.
టేబుల్ టెన్నిస్‌కు వీడ్కోలు పలికిన శరత్ కమల్.. ప్రస్తుతం ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అథ్లెటిక్స్ విభాగంలో సభ్యుడిగా కొనసాగుతున్నాడు. ఖేల్ రత్న పురస్కార గ్రహిత అయిన శరత్ కమల్.. తాజాగా మైఖేల్‌కు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా టెబుల్ టెన్నిస్‌లో భారత్ మెడల్స్ సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.

ఒలింపిక్స్‌లో భారత్‌కు పతకాలు..
'భారత్ ప్రధాన టోర్నీల్లో టేబుల్ టెన్నిస్ విభాగంలో పతకాలు గెలవదనే వాదనతో నేను ఏకీభవించను. మేం ఎన్నో పతకాలు గెలుస్తున్నాం. ప్రస్తుతం భారత్ టేబుల్ టెన్నిస్ డబుల్స్‌లో రెండో ర్యాంక్‌లో కొనసాగుతోంది. గత ఆసియా గేమ్స్‌లో చైనాను వారి సొంతగడ్డపై ఓడించాం. ఈ విజయాలు మెనుపెన్నడూ చూడనివి. సీనియర్లు, జూనియర్లు మెరుగైన ప్రదర్శన చేస్తున్నారు. చింతరిలా దాస్, దివ్యాంశి భౌమిక్, బీబీ అభినందన్, అంకు భట్టాచార్య, ప్రేమజ్ భట్టా చార్య వంటి యువ ప్లేయర్లు భారత దేశపు తదుపరి స్టార్స్‌గా సత్తా చాటబోతున్నారు.
ఇప్పటికే భారత టేబుల్ టెన్నిస్ ఆటగాళ్లు ప్రపంచ టైటిళ్లను గెలుచుకున్నారు. 2032, 2036 ఒలింపిక్స్‌లో భారత్ పతకాలు గెలుస్తుందనే నమ్మకం నాకుంది. అయితే యువ క్రీడాకారులు కేవలం జూనియర్ టోర్నీలే కాకుండా సీనియర్ టోర్నీల్లో కూడా ఆడి తమ ప్రతిభను నిరూపించుకోవాలి.
అంతర్జాతీయ టోర్నీలకు ఆరుగురు సీనియర్ క్రీడాకారులను పంపే బదులు.. నలుగురు సీనియర్స్‌తో పాటు ఇద్దరు జూనియర్స్‌ను పంపించాలి. దాంతో కుర్రాళ్లకు అక్కడి వాతావరణం తెలియడంతో పాటు సీనియర్ ఆటగాళ్లతో మంచి సమన్వయం ఏర్పడుతుంది. అలా కాకుండా జూనియర్ టోర్నీలు మాత్రమే ఆడి గెలవడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు.
యువ క్రీడాకారులు నేరుగా సీనియర్ కేటగిరిలో ఆడినప్పుడు.. వారికి ప్రతీది కొత్తగా అనిపిస్తుంది.'అని శరత్ కమల్ చెప్పుకొచ్చాడు.
2022 కామన్వెల్త్ గేమ్స్ 5 పతకాలు..
2022 బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్‌లో భారత టేబుల్ టెన్నిస్ టీమ్ 3 స్వర్ణాలు, కాంస్యం, రజతంతో సహా మొత్తం ఐదు పతకాలు గెలిచింది. అయితే ఈ సారి గ్లాస్గో వేదికగా జరిగే కామన్వెల్త్ గేమ్స్ నుంచి టేబుల్ టెన్నిస్‌ను తొలగించారు. దాంతో భారత్ పతకాల సంఖ్య తగ్గే అవకాశం ఉంది. జపాన్‌లో జరిగే ఆసియా గేమ్స్ 2026లోనే టేబుల్ టెన్నిస్ ప్లేయర్లు బరిలోకి దిగనున్నారు.
ఆసియా గేమ్స్‌లో సింగిల్స్ కంటే డబుల్స్, టీమ్ ఈవెంట్స్‌లోనే భారత్‌కు ఎక్కువ పతకాలు వచ్చే అవకాశం ఉన్నాయని శరత్ కమల్ అభిప్రాయపడ్డాడు. మానవ్ థక్కర్, మనుష్ షాల పురుషుల డబుల్స్ జోడీ, ఆకుల శ్రీజ, దియా సీతాలేల నేతృత్వంలోని మహిళల డబుల్స్ జోడీ.. భారత మిక్స్‌డబుల్స్ జోడీ ఆసియాలోనే అత్యుత్తమ ప్లేయర్లకు సవాల్ విసురుతుందని శరత్ కమాల్ విశ్వాసం వ్యక్తం చేశాడు. చైనా, జపాన్, కొరియాల ఆధిపత్యం కారణంగా సింగిల్స్‌లో భారత్‌కు గట్టి పోటీ ఎదురవుతుందని చెప్పాడు.
క్రీడా వ్యవస్థ మొత్తం పనిచేయాలి..
2036 ఒలింపిక్స్‌కు భారత్ ఆతిథ్యం ఇచ్చేందుకు కామన్వెల్త్ గేమ్స్ సరైన మార్గాన్ని అందిస్తుందనిని శరత్ కమాల్ అభిప్రాయపడ్డాడు. కేవలం మౌలిక సదుపాయాలను కల్పించడమే కాకుండా.. ప్రధాన టోర్నీలను ఎలా నిర్వహించాలో తెలుస్తుందని చెప్పాడు. కేవలం క్రీడాకారులతోనే క్రీడా దేశంగా మార్చలేమని, నిర్వాహకులు, కోచ్‌లు, మొత్తం క్రీడా రంగం కలిసి పనిచేయాలని పిలుపునిచ్చాడు. రిటైర్మెంట్ తర్వాత క్రీడల పరిపాలన అధికారిగా పనిచేయడం సంతోషంగా ఉందని చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

