ఖో ఖో ప్రపంచకప్ 2025లో భారత్ జోరు కొనసాగుతోంది. వరుస విజయాలతో పురుషులు, మహిళల జట్లు క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించాయి. బుధవారం జరిగిన మ్యాచ్‌లో భారత పురుషుల జట్లు 70-38 తేడాతో పెరూను ఓడించింది. గ్రూప్-ఏలో ఉన్న భారత పురుషుల జట్టుకు ఇది హ్యాట్రిక్ విజయం. భారత్ తరఫున ప్రతీక్, ఆదిత్య, శివారెడ్డి, సచిన్ సత్తా చాటారు.
పెరూతో జరిగిన మ్యాచ్‌లో భారత్ నాలుగు టర్న్‌ల్లో పూర్తి ఆధిపత్యం చెలాయించింది. తొలి టర్న్‌లో 36 పాయింట్స్ సొంతం చేసుకున్న భారత్.. తర్వాతి మూడు టర్న్‌ల్లో ఆధిపత్యం చెలాయించి 70 పాయింట్లతో విజయలాంఛనాన్ని పూర్తి చేసింది.

మరోవైపు భారత అమ్మాయిల జట్టు గ్రూప్-ఏ పోరులో 100-16 తేడాతో ఇరాన్‌ను చిత్తు చేసింది. భారత్ తరఫున అశ్విని, నిర్మల, ప్రియాంక, నస్రీన్ సత్తా చాటారు. ప్రియాంక 'బెస్ట్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్'అవార్డను సొంతం చేసుకుంది. అంతకుముందు భారత మహిళల జట్టు తన తొలి మ్యాచ్‌లో 175-18 తేడాతో సౌత్ కొరియాను ఓడించిన విషయం తెలిసిందే.