Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

విషాదం.. రోడ్డు ప్రమాదంలో స్టార్ ప్లేయర్ మృతి!

కెన్యా మారథాన్ సెన్సేషన్, స్టార్ అథ్లెట్ కెల్విన్ కిప్టమ్ మరణించాడు. 24 ఏళ్ల వయసులోనే రోడ్డు ప్రమాదంలో కన్నుమూశాడు. ఆదివారం రాత్రి పశ్చిమ కెన్యాలోని ఎల్డోరెట్-కప్తగట్ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో కిప్టమ్‌తో ఆయన కోచ్ గైర్వైస్ హకిజిమానా మృతి చెందారు. మరో మహిళ తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

రువాండాకు చెందిన తన కోచ్ తో కలిసి కారులో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కెల్విన్ అకాల మరణంతో క్రీడా లోకంలో విషాదం నెలకొంది. కెన్యా రాజకీయ నాయకులు, అథ్లెట్ల‌తో పాటు వరల్డ్ స్పోర్ట్స్ స్టార్స్ కెల్విన్ అకాల మరణంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. అతని మరణానికి సంతాపం తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు.

Kenyas Marathon sensation Kelvin Kiptum dies in road accident at 24

24ఏళ్లకే కెల్విన్ కిప్టమ్​ మారథాన్​లో సూపర్ స్టార్​గా అవతరించారు. మారథాన్​ను కేవలం 2 గంటల నిమిషంలోపు పరుగెత్తిన తొలి వ్యక్తిగా వరల్డ్ రికార్డు సృష్టించాడు. గతేడాది అక్టోబర్​లో జరిగిన షికాగో మారథాన్ రేసు(42.195 కిలోమీటర్లు)​లో కేవలం 2:00.35 నిమిషాలలోపే పూర్తి చేశాడు. దీంతో అప్పటివరకు టాప్‌లో ఉన్న కెన్యా ఎలియర్​ కిప్​చోగ్​(2:01:09) ను కెల్విన్ అధిగమించాడు.

ఈ రికార్డును గత వారమే అంతర్జాతీయ ట్రాక్ ఫెడరేషన్ వరల్డ్ అథ్లెటిక్స్ ధ్రువీకరించింది. 2022లో వాలెన్సియాలో జరిగిన మారథాన్​తో ఎంట్రీ ఇచ్చిన కెల్విన్.. ప్రపంచంలోనే ప్రతిష్టాత్మక లండన్, చికాగో రేసుల్లో విజేతగా నిలిచాడు. మారథాన్ పరుగును అత్యంత వేగంగా పూర్తి చేసిన టాప్ 7 రికార్డ్స్‌లో 3 కెల్విన్‌వే కావడం విశేషం.

పారిస్ ఒలింపిక్స్ తో పాటు మారథాన్ ను 2 గంటల్లోపే పూర్తి చేయాలన్న లక్ష్యాలను పెట్టుకున్న కెల్విన్.. వాటిని అందుకోకుండానే తుది శ్వాస విడిచాడు.

Story first published: Monday, February 12, 2024, 10:12 [IST]
Other articles published on Feb 12, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+