Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

తండ్రి అయిన ఉసెన్ బోల్ట్

Jamaican sprint legend Usain Bolt and his partner Kasi Bennett welcome baby girl

కింగ్‌స్టన్‌: జమైకా స్ప్రింట్ దిగ్గజం ఉసేన్‌ బోల్ట్‌ తండ్రయ్యాడు. అతని సహచరి కేసీ బెన్నెట్‌ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ సందర్భంగా జమైకా ప్రధానమంత్రి ఆండ్రూ హోల్‌నెస్‌ సోషల్‌ మీడియా ద్వారా బోల్ట్‌, కేసీకి శుభాకాంక్షలు తెలపడంతో ఈ విషయం వెల్లడైంది. 'మా స్ప్రింట్ కింగ్ బోల్ట్, బెన్నెట్‌కు కూతురు పుట్టింది. ఓ అందమైన అమ్మాయిని ఈ భూమి మీదకు తీసుకొచ్చినందుకు మీకు నా అభినందనలు.' అని ఆండ్రూ ట్వీట్‌ చేశారు. బోల్ట్ జోడీ అధికారికంగా వెల్లడించకపోయినా.. పాప ఆదివారం జన్మించిందని స్థానిక మీడియా తెలిపింది.

గత మార్చిలోనే బోల్ట్‌... తమకు ఆడబిడ్డ పుట్టబోతున్నట్లు సోషల్‌ మీడియాలో తెలిపాడు. దాదాపు దశాబ్దంపాటు పురుషుల స్ప్రింట్‌లో తన హవాను చాటిన బోల్ట్‌ 2017లో రిటైర్‌ అయ్యాడు. 100 మీటర్లు, 200 మీటర్ల పరుగులో ప్రపంచ రికార్డు నెలకొల్పిన బోల్ట్‌... 2008, 2012, 2016 ఒలింపిక్స్‌ క్రీడల్లో 100, 200 మీటర్లలో పసిడి పతకాలు గెల్చి ఈ ఘనత సాధించిన ఏకైక స్ప్రింటర్‌గా చరిత్ర సృష్టించాడు.

100,200 మీటర్ల పరుగులో బోల్ట్ నెలకొల్పిన వరల్డ్ రికార్డులు ఇంకా పదిలంగానే ఉన్నాయి. ఓవరాల్‌గా తన అథ్లెటిక్ కెరీర్‌లో 8 ఒలింపిక్ బంగారు పతకాలతో పాటు 11 వరల్డ్ ఛాంపియన్‌షిప్ పతకాలను ఉసేన్ బోల్ట్ సాధించాడు. ఇక తనన సంతానాన్ని తన అడుగు జాడల్లో నడవనియ్యనని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఉసెన్ బోల్ట్ తెలిపాడు.'నా పిల్లలు నాలానే కావాలనుకుంటే మంచిదే. కానీ మొదట్లో మాత్రం వద్దని చెబుతాను. ఎందుకంటే ఆ కష్టం ఏంటో నాకు తెలుసు.'అని బోల్ట్ చెప్పుకొచ్చాడు.

Story first published: Wednesday, May 20, 2020, 8:30 [IST]
Other articles published on May 20, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+