అసభ్యకరంగా ప్రవర్తించి అరెస్ట్ అయిన అథ్లెట్!

టెహ్రాన్: అసభ్యకరమైన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేశాడని ఇరాన్‌కు చెందిన 28 ఏళ్ల పార్కూర్ అథ్లెట్ అలీరెజా జపలాఘీని టెహ్రాన్ పోలీసులు అరెస్ట్ చేశారు. భవనాల మీద నుంచి ఇతర భవనాల మీదకు దూకడంతో పాటు ఒళ్లు గగుర్పొడిచే విన్యాసాలు చేసే పార్కూర్ అథ్లెట్‌గా అలీరెజా ప్రసిద్ధుడు.
అయితే స్థానికంగా ఓ భారీ భవనం అంచున తాను, ఓ మహిళను ముద్దు పెట్టుకున్న వీడియో, ఫొటోలను అలీరజా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో అతనిపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. ఇక ఆ వీడియోలోని మహిళను కూడా అరెస్ట్ చేస్తామని తెలిపారు. సదరు మహిళ పొట్టి దుస్తులు ధరించి ఇరాన్ నిబంధనలను కూడా అతిక్రమించింది.
అలీరెజా తన ఇన్‌స్టాగ్రామ్‌లో లక్షా 33 వేల మంది ఫాలోవర్లు కలిగి ఉన్నాడు. పార్కూర్ అనేది ఫ్రాన్స్‌కు చెందిన వినూత్నమైన క్రీడ. 1990లో మొదలైన ఈ ఆట.. ప్రాణాలను సైతం దిక్కరించి ఒళ్లు గగుర్పొడిచే విన్యాసాలతో ఉంటుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications