For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కరోనాను ఓడించిన ఇరాన్ అథ్లెట్

Irans Olympic medalist Ehsan Hadadi has recovered successfully from coronavirus

న్యూఢిల్లీ: మైదానంలో ప్రత్యర్థులను ఓడించి విజేతగా నిలిచిన ఓ అథ్లెట్‌.. కరోనాపై కూడా విజయం సాధించాడు. ప్రాణాంతక వైరస్‌ను మనోబలంతో ఎదుర్కొని సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా తిరిగి వచ్చాడు. అతనెవరోకాదు ఇరాన్ డిస్కస్‌ త్రో ప్లేయర్ ఇహ్సాన్‌ హడాడి. కరోనా కొరల్లో చిక్కుకుపోయిన ఇరా‌న్‌లో హడాడి కరోనాను ఓడించాడు. కరోనా వ్యాధి తన ఆలోచనా ధృక్పథాన్ని మార్చిందన్నాడు.

తండ్రికి సోకిన మరుసటి రోజే..

తండ్రికి సోకిన మరుసటి రోజే..

ఒలింపిక్ విజేత అయితన 35 ఏళ్ల హడాడి గత నెలలో కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. తన తండ్రికి కరోనా పాజిటివ్ తేలిన మరసటి రోజే 135 కిలోలు బరువు, 6 అడుగుల 4 ఇంచులు ఎత్తు కలిగిన ఈ ఆజాను బావుడికి కూడా పాజీటీవ్ వచ్చింది. ఇక తన క్వారంటైన్ సమయాన్ని, చికిత్స సమయంలో తను ఎదుర్కొన్న ఇబ్బందులను ఈ డిస్కస్ త్రోయర్ చెప్పుకొచ్చాడు.

10 రోజులు చాలా కష్టంగా..

10 రోజులు చాలా కష్టంగా..

‘నా జీవితంలో ముందెన్నడు ఇంత బలహీనంగా మారలేదు. ఇది నన్ను చాలా బాధపెట్టింది. కరోనా పరీక్షలకు మూడు రోజుల ముందే నేను ట్రైనింగ్ సెషన్‌లో పాల్గొన్నాను. అప్పుడు నాకంతా బాగానే ఉంది. కానీ పరీక్షలకు ముందు రోజు మాత్రం కొంచె సిక్ అయ్యాను. ఆ రోజు నా తల్లితండ్రులకు డిన్నర్ ప్రిపేర్ చేశాను. మార్చి 23 నాకు, నాతండ్రికి పరీక్షలు నిర్వహించడంతో పాజీటీవ్ అని తెలింది. ఇక క్వారంటైన్‌లో తొలి 10 రోజులు చాలా కష్టంగా గడిచింది. కానీ ఈ వైరస్‌ను జయించగలను అనుకునేవాడిని. మా తండ్రికి అథ్లెట్లు ఆరోగ్య వంతులని, ఎప్పుడు ట్రైనింగ్ తీసుకుంటాం కాబట్టి త్వరగా కోలుకుంటామని చెప్పా.

కానీ తానెంత తప్పో ఆరో రోజు తెలిసింది. ఆరోజు కనీసం శ్వాస కూడా తీసుకోలేకపోయా. కానీ నా మనసుకు మాత్రం ఏం కాదు అని చెప్పుకున్నా. ఆ తర్వాత నెమ్మదిగా కోలుకున్నా'అని హడాడి చెప్పుకొచ్చాడు. ఇక హడాడికి మరోసారి కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు. పాజీటీవ్ వస్తుందని అతను ధీమా వ్యక్తం చేశాడు. ఇక వరల్డ్ హెల్డ్ ఆర్గనైజేషన్ లెక్కల ప్రకారం(ఏప్రిల్ 7 నాటికి) ఇరాన్‌లో కరోనా బాధితుల సంఖ్య 60 వేలకు చేరగా.. 3739 మంది మరణించారు.

ఒలింపిక్స్ వాయిదా ఆటగాళ్లకు నష్టమే..

ఒలింపిక్స్ వాయిదా ఆటగాళ్లకు నష్టమే..

కరోనా‌ కారణంగా ఒలింపిక్స్ వాయిదా పడటం సీనియర్ ఆటగాళ్లకు నష్టం కలిగించే విషయమేనని ఈ ఇరాన్ ప్లేయర్ చెప్పుకొచ్చాడు. కాకపోతే గాయాలతో ఇబ్బంది పడుతున్న వారికి మాత్రం ఓ వరంలాంటిదన్నాడు.

‘ఒలింపిక్స్ వాయిదా పడటం 30 ఏళ్లు పైబడిన ఆటగాళ్లకు అనుకూలమైంది కాదు. ఎందుకంటే వచ్చే ఏడాది వా శరీరం ఎలా స్పందిస్తుందో చెప్పలేం. ఇక గాయాలతో బాధపడేవారికి మాత్రం ఓ మంచి అవకాశం. నాకు కూడా ఓ చిన్న గాయం ఉంది, సర్జరీ చేసుకోవడానికి కూడా సమయం దొరికింది. వచ్చే ఏడాది ఒలింపిక్స్ జరుగుతాయని నమ్ముతున్నా'అని హడాడి చెప్పుకొచ్చాడు. ఇక కరోనా కారణంగా ఈ ఏడాది జరగాల్సిన టోక్యోఒలిపింక్స్ వచ్చే ఏడాదకి వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇక 2012 లండన్‌ ఒలింపిక్స్‌లో సిల్వర్ మెడల్ సాధించిన ఇహ్సాన్‌ హడాడి.. 2011 ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లోనూ బ్రాంజ్ మెడల్ నెగ్గాడు.

Story first published: Sunday, April 19, 2020, 18:05 [IST]
Other articles published on Apr 19, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+